తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసిన బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్.. వైరల్ అవుతున్న ఫోటో

బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజీత్ ఇప్పుడు చాలా ఫెమస్ అయ్యాడు. 'లైఫ్ ఈస్ బ్యూటీఫుల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజీత్ ఆతర్వాత 'పెళ్లిగోల' అనే వెబ్ సిరీస్ చేసాడు.

తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసిన బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్.. వైరల్ అవుతున్న ఫోటో
Rajeev Rayala

|

Dec 29, 2020 | 3:46 PM

బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజీత్ ఇప్పుడు చాలా ఫెమస్ అయ్యాడు. ‘లైఫ్ ఈస్ బ్యూటీఫుల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజీత్ ఆతర్వాత ‘పెళ్లిగోల’ అనే వెబ్ సిరీస్ చేసాడు. ఆతర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఈ కుర్రహీరో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మొదటినుంచి హౌస్ లో కూల్ అండ్ కామ్ గా ఉంటూ వచ్చిన అభిజీత్.. టాస్క్ ల సమయంలో తెలివిగా ఆడాడు. ఇక అందరు అనుకున్నట్టుగానే బిగ్ బాస్ సీజన్ 4 కు విన్నర్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిజీత్ తన స్నేహితులను కలుస్తూ.. వరుస ఇంటర్వ్యూలతో బీజీ బిజీ గా ఉన్నాడు. తాజాగా తన మొదటి సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసాడు అభి.

శేఖర్ కమ్ములను కలిసిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు అభిజీత్. సెన్సబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈస్ బ్యూటీఫుల్’ సినిమాతోనే అభిజీత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక శేఖర్ కమ్ములతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తనకు సినిమా కన్నా ఎక్కువ నేర్పిన శేఖర్ కమ్ములగారికి కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. ఇటీవలే తనకు సపోర్ట్ చేసిన మెగా బ్రదర్ నాగబాబును, తన కోస్టార్ విజయ్ దేవరకొండను కలిసిన అభిజీత్ ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Also read :

2020 Round Up : ఈ ఏడాది పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే.. కరోనా కాలంలో ఒక్కటైన జంటలు

భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్.. హృద‌యానికి హద్దుకుంటోన్న ‘ఆహా’ సామ్‌జామ్ కొత్త ప్రోమో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu