2020 Round Up : ఈ ఏడాది పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే.. కరోనా కాలంలో ఒక్కటైన జంటలు

2020 చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది. ఈ  ఏడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు ప్రాణాలను..

2020 Round Up : ఈ ఏడాది పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే.. కరోనా కాలంలో ఒక్కటైన జంటలు
Follow us

|

Updated on: Dec 29, 2020 | 4:58 PM

2020 చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది. ఈ  ఏడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని జీవించారు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ అంతా కుదేలైంది. షూటింగ్ లు  ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సినిమా తారలంతా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే  కరోనా తో జనజీవనం అస్తవ్యస్తం అయినా కొందరి జీవితాల్లో తీపిగుర్తులను మిగిల్చింది.  2020 ఎలా ఉన్నా కొంతమంది టాలీవుడ్ సెలబ్రెటీల జీవితంలో మధురానుభూతులను నింపింది. కరోనా కారణంగా వైభవంగా వివాహం చేసుకోవాలిన వాళ్ళు చాలా సింపుల్ గా కానిచ్చేశారు.

వీరిలో ముందుగా  చెప్పుకోవాల్సింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లి గురించి చెప్పుకోవాలి. స్టార్ ప్రొడ్యూసర్ గా  టాలీవుడ్ లో రాణిస్తున్న దిల్ రాజు తన బంధువుల అమ్మాయి తేజేస్వినిని వివాహం చేసుకున్నారు. దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోయిన చాలా రోజుల తర్వాత దిల్ రాజు పెళ్ళిచేయాసుకున్నారు. ఈ ఏడాది మే 10న వీరి వివాహం నిజామాబాద్ లోని ఓ టెంపుల్ లో జరిగింది. ఆతర్వాత యంగ్ హీరో నిఖిల్ పెళ్లి కూడా  ఈఏడాది మే14న జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫ్యామిలీ మెంబెర్స్ కొందరు సన్నిహితుల మధ్య తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మను పెళ్లాడాడు.

ఇక మరో యంగ్ హీరో నితిన్ కూడా తన ప్రేయసి షాలిని మెడలో మూడుముళ్ళు వేసాడు. చాలా కాలంగా శాలినితో ప్రేమలో ఉన్న నితిన్.. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.ఆతర్వాత చాలా కాలం పెళ్లికోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ముందుగా ఏప్రిల్ 15న దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అది కుదరలేదు. దాంతో హైదరాబాద్ లోని ఫలక్‌నుమా ప్యాలెస్ లో సింపుల్ గా నితిన్ పెళ్లి జరిగింది.ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఇక దగ్గుబాటి వారబ్బాయి రానా పెళ్లి కూడా చాలా సదాసీదాగానే జరిగింది. లాక్ డౌన్ లోనే తను నాకు ఎస్ చెప్పింది అని ప్రేయసి మిహికాను అందరికీ పరిచయం చేసిన రానా. అదే లాక్ డౌన్ లో మిహికా మెడలో మూడుముళ్లు వేసాడు. రామానాయుడు స్టూడియోలో ఆగస్టు8న మిహికా బజాజ్ ను పెళ్ళాడాడు. కుటుంబ సభ్యులు అతికొద్ది మంది సన్నిహితులు అతిథుల మధ్య తెలుగు మరియు మరాఠీ సంప్రదాయ పద్ధతుల్లో రానా పెళ్లి జరిగింది. ఇక యంగ్ డైరెక్టర్ సుజిత్ కూడా ఈఏడాది ఓ ఇంటివాడయ్యాడు. ఆగస్టు 2న ప్రవళిక ను సుజిత్ హైదరాబాద్ లో వివాహం చేసుకున్నాడు.

అందాల చందమామ కాజల్ పెళ్లికూడా అయిపోయింది.  గత కొన్నేళ్లుగా యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లుతో ప్రేమలో ఉన్న కాజల్ అక్టోబర్ 30న ముంబయిలోని తాజ్ హోటల్ లో వివాహం చేసుకొని కొత్తజీవితాన్ని మొదలు పెట్టింది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కల్యాణ వేడుక కూడా ఈ ఏడాదే జరిగింది. ఉదయ్ పూర్ లో జరిగిన ఈ పెళ్ళికి మెగాఫ్యామిలీ అతికొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి జరిగింది. ఇలా ఈఏడాది టాలీవుడ్ లో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపించాయి.

Also read :

‘Master’ release date : ‘సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా’..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్

Rakul Preet Singh Recovers: రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా నెగిటీవ్.. ట్విటర్ ద్వారా వెల్లడించిన ఢిల్లీ బ్యూటీ.. జాగ్రత్త అంటూ హితవు..

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు