తెలుగు బిగ్ బాస్ 4: ఎఫ్3లో అభిజిత్‌కు కీలక పాత్ర.. అసలు ఇందులో నిజమెంత.!!

Bigg Boss 4: అన్ని సీజన్లలోనూ బిగ్ బాస్ - 4 వేరయా... అన్నీ తానై నడిపించిన నాగ్ మామా.. మునపటి సీజన్ల కంటే ఈ ఏడాది బిగ్ బాస్ కొంచెం డిఫరెంట్...

  • Ravi Kiran
  • Publish Date - 2:07 pm, Tue, 29 December 20
తెలుగు బిగ్ బాస్ 4: ఎఫ్3లో అభిజిత్‌కు కీలక పాత్ర.. అసలు ఇందులో నిజమెంత.!!

Bigg Boss 4: అన్ని సీజన్లలోనూ బిగ్ బాస్ – 4 వేరయా… అన్నీ తానై నడిపించిన నాగ్ మామా.. మునపటి సీజన్ల కంటే ఈ ఏడాది బిగ్ బాస్ కొంచెం డిఫరెంట్ అని చెప్పవచ్చు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు మంచి గుర్తింపు రావడంతో పాటు పలు ఆఫర్లు కూడా తలుపు తట్టాయి. ఇప్పటికే సోహైల్‌కు సినిమా అవకాశం రాగా.. తన తదుపరి చిత్రంలో దివి ఓ కీలక పాత్ర పోషిస్తోందని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించడం జరిగింది. అయితే అభిజిత్, అఖిల్‌కు ఇప్పటిదాకా ఆఫర్స్ ఏమి రాకపోవడం వారి అభిమానులను నిరాశకు గురి చేశాయి.

ఇక ఇప్పుడు తాజాగా అభిజిత్‌కు ఓ సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘ఎఫ్ 3’ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం అభితో సంప్రదింపులు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కూడా ఇలాగే అభిజిత్‌కు ఆఫర్స్ వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా.. అది ఫేక్ అని తేలింది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..