AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BiggBoss4: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన దేత్తడి హారిక.. పార్కులో మొక్కలు నాటిన యూట్యూబ్‌ స్టార్‌

యూట్యూబ్‌లో పలు షార్ట్‌ మూవీలు, వెబ్‌ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన హారిక.. బిగ్‌బాస్‌4తో ఒక్కసారిగా పేరు సంపాదిచుకున్నారు. షో చివరి వరకు పోటీనిచ్చిన హారిక టైటిల్‌ను గెలుచుకోలేక పోయినా అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకోగలిగారు. ఇదిలా ఉంటే తాజాగా హారిక...

BiggBoss4: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన దేత్తడి హారిక.. పార్కులో మొక్కలు నాటిన యూట్యూబ్‌ స్టార్‌
Narender Vaitla
|

Updated on: Dec 28, 2020 | 5:02 PM

Share

Harika accepts green india challenge: యూట్యూబ్‌లో పలు షార్ట్‌ మూవీలు, వెబ్‌ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన హారిక.. బిగ్‌బాస్‌4తో ఒక్కసారిగా పేరు సంపాదిచుకున్నారు. షో చివరి వరకు పోటీనిచ్చిన హారిక టైటిల్‌ను గెలుచుకోలేక పోయినా అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకోగలిగారు. ఇదిలా ఉంటే తాజాగా హారిక గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. రాజ్యసభ్య సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ అభిజిత్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన హారిక సోమవారం జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ.. ‘గతంలోనూ నేను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాను. ఇప్పుడు రెండోసారి మొక్కలు నాటుతుండడం ఆనందంగా ఉంది. వాతావరణ కాలుష్యం తగ్గించేందుకుగాను గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ గారికి నా అభినందనలు. ఈ ఛాలెంజ్‌ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని’ కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక నటుడు నోయెల్‌ సేన్‌, బిగ్‌బాస్‌2 ఫేం దీప్తి సునైనాలను మొక్కలు నాటాలని హారిక ఛాలెంజ్‌ విసిరారు.

Follow Us