AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస ఆఫర్లతో దూసుకెళుతోన్న ఢిల్లీ బ్యూటీ.. చేతి నిండా సినిమాలతో హల్చల్‌ చేస్తోన్న అందాల తార.

అందం, అభినయం కలగలిపిన హీరోయన్లలో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒకరు. 'కెరటం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ఢిల్లీ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో అగ్ర కథనాయకుల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసిన ఈ అమ్మడు...

వరుస ఆఫర్లతో దూసుకెళుతోన్న ఢిల్లీ బ్యూటీ.. చేతి నిండా సినిమాలతో హల్చల్‌ చేస్తోన్న అందాల తార.
Narender Vaitla
|

Updated on: Dec 28, 2020 | 4:16 PM

Share

Rakul preet singh busy with movies: అందం, అభినయం కలగలిపిన హీరోయన్లలో నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒకరు. ‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ఢిల్లీ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో అగ్ర కథనాయకుల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసిన ఈ అమ్మడు. అనంతరం తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ఇటీవల కరోనా బారిన రకుల్‌ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటోంది. ఇదిలా ఉంటే చేతి నిండా సినిమాలతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫుల్‌ బిజీగా మారింది. ప్రస్తుతం రకుల్‌ చేతిలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో పాటు నితిన్‌ హీరోగా రానున్న ‘చెక్‌’ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో అర్జున్‌ కపూర్‌తో ‘సర్దార్‌ అండ్‌ గ్రాండ్ సన్‌’, జాన్‌ అబ్రహంతో ‘ఎటాక్‌’, అజయ్‌ దేవ్‌గణ్‌తో ‘మే డే’ చిత్రాల్లో నటిస్తోంది. అంతటిదో ఆగకుండా తమిళంలో కూడా ‘ఇండియన్‌2’తో పాటు, శివకార్తికేయన్‌ సరసన ‘అలయన్‌’ సినిమాలో కూడా నటిస్తోంది. ఇలా ఒకేసారి ఏడు సినిమాలతో రకుల్‌ అగ్ర హీరోయిన్‌ స్థానాన్ని కైవసం చేసుకునే పోటీలో దూసుకెళుతోంది. మరి ఈ సినిమాలు రకుల్‌కు ఎలాంటి సక్సెస్‌ను ఇస్తాయో చూడాలి.

Follow Us