బిగ్ బాస్: హౌస్‌లో వరుణ్, శ్రీముఖిల మధ్య ‘వార్’

బిగ్ బాస్: హౌస్‌లో వరుణ్, శ్రీముఖిల మధ్య 'వార్'

ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో బిగ్ బాస్ ఎనిమిదో వారం చివరికి చేరుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన పలు టాస్కులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌‌లోని నియమాలను సరిగ్గా అర్ధం చేసుకోకపోవడంతో కాస్త గందరగోళం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ విషయంలో వరుణ్ సందేశ్, శ్రీముఖి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను […]

Ravi Kiran

|

Sep 14, 2019 | 3:49 PM

ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో బిగ్ బాస్ ఎనిమిదో వారం చివరికి చేరుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన పలు టాస్కులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌‌లోని నియమాలను సరిగ్గా అర్ధం చేసుకోకపోవడంతో కాస్త గందరగోళం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ విషయంలో వరుణ్ సందేశ్, శ్రీముఖి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్ బాస్.. అక్కడ వారి చేత చిన్న చిన్న టాస్కులను ఆడించాడు. వారందరూ లోపల టాస్క్ చేసిన తర్వాత బయటికి వచ్చి.. లోపల జరిగిన విషయాన్ని మిగతా ఇంటి సభ్యులకు చెప్పాలి. ఇక అది నిజమా.? కాదా.? అనే విషయాన్ని మిగిలిన వారు గెస్ చేయాలి. ఎవరు ఎక్కువ కరెక్ట్ చెబితే.. రాత్రికి మంచి డిన్నర్ లభిస్తుంది.

మొదటగా బాబా భాస్కర్ వెళ్లి.. అక్కడ ఏబీసీడీలు చెప్పించారంటూ బయటికి వచ్చి చెప్పారు. ఇంటి సభ్యులు కూడా అది నిజమే అని గెస్ చేశారు. ఆ తర్వాత రవి – హిమజ వెళ్లగా.. వారిని స్వీట్స్, చాకలేట్స్ తినమని చెప్పారు. వీరి తర్వాత శివజ్యోతి- పునర్నవీలు  కలిసి వెళ్లారు. ఒకరి చేత తెలుగు పద్యాలు, మరొకరి చేత ఇంగ్లీష్ రైమ్స్ చెప్పించారు. అలాగే వరుణ్- వితికలు కన్ఫెషన్ రూమ్‌‌లోకి వెళ్లగా.. వారిని సీక్రెట్‌గా మాట్లాడుకోమని చెబుతారు. ఇక వీరందరూ బయటికి వచ్చి జరిగినదంతా చెప్పగా.. అది నిజమే అని మిగతా వాళ్ళు గెస్ చేశారు.

ఇక చివరిగా వెళ్లిన రాహుల్ ఒక్కడికి 50 సిటప్స్ చేసి..10 యాప్పీ ఫిజ్ డ్రింక్స్ తాగమని చెబుతారు. అయితే కన్ఫెషన్ రూమ్‌‌లో తాను చేసింది కాకుండా ఇంటి నుంచి అమ్మ ఫోన్ చేసిందని.. పెళ్లి సంబంధాలు వస్తున్నాయని చెప్పాలని బిగ్ బాస్ రాహుల్‌కి చెబుతాడు. దీనితో బయటికి వచ్చిన రాహుల్.. బిగ్ బాస్ చెప్పమన్నట్లుగా చెబుతాడు. ఇక ఈ విషయంలో యాంకర్ శ్రీముఖి పప్పులో కాలేసింది. తను తప్పు చెప్పడమే కాకుండా మిగతా వాళ్ళ చేత కూడా తప్పు చెప్పించేలా చేసింది. అందరూ కూడా రాహుల్ నిజం చెబుతున్నాడని అన్నారు. కానీ అది కరెక్ట్ కాదని బిగ్ బాస్ ప్రకటించడంతో వరుణ్ శ్రీముఖిపై ఫైర్ అవుతాడు. నువ్వు నీ డెసిషన్ చెప్పుకోకుండా…కరెక్ట్ చెప్పకపోతే బొక్క పడుద్ది అని మాట్లాడి మిగతా వాళ్ళని ప్రభావితం చేసి వారి చేత కూడా తప్పు చెప్పించావని మండిపడ్డాడు.

‘నేను డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నా.. బొక్క పడిపోద్ది అన్నది నా లాంగ్వేజ్.. నా స్టైల్. నా అభిప్రాయం నేను చెప్పా అంటూ శ్రీముఖి తనదైన శైలిలో అరిచిచెప్పింది. ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం పెద్దది కావడంతో మిగతా వాళ్ళు సర్ది చెప్పారు. అయితే చివరికి ఎక్కువ కరెక్ట్ సమాధానాలు చెప్పడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మంచి డిన్నర్ ఇచ్చాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu