బిగ్ బాస్: మహేష్ ప్యాకప్.. కంటెస్టెంట్లు షాక్!

మహేష్ విట్టాను బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. అయ్యో నిజంగా ఎలిమినేట్ అయ్యాడనుకుంటే పొరపాటే.. ఇది జస్ట్ సీక్రెట్ టాస్క్. మహేష్ నిజంగానే ఎలిమినేట్ అయినట్లు ఇంటి సభ్యులు నమ్మాలి. ఇది మహేష్‌కు ఇచ్చిన సీక్రెట్ టాస్క్. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఉన్న మహేష్‌కు ఈ సీక్రెట్ టాస్క్ ఉపయోగపడుతుందా.. లేదా అనేది చూడాలి. మహేష్ మినహా అందరూ ఆడవారే ఎలిమినేషన్‌లో ఉన్నారు కాబట్టి.. బిగ్ బాస్ ఈ సీక్రెట్ టాస్క్ రూపంలో మహేష్‌ను సేవ్ […]

బిగ్ బాస్: మహేష్ ప్యాకప్.. కంటెస్టెంట్లు షాక్!
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 13, 2019 | 8:41 PM

మహేష్ విట్టాను బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. అయ్యో నిజంగా ఎలిమినేట్ అయ్యాడనుకుంటే పొరపాటే.. ఇది జస్ట్ సీక్రెట్ టాస్క్. మహేష్ నిజంగానే ఎలిమినేట్ అయినట్లు ఇంటి సభ్యులు నమ్మాలి. ఇది మహేష్‌కు ఇచ్చిన సీక్రెట్ టాస్క్. ఇక ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఉన్న మహేష్‌కు ఈ సీక్రెట్ టాస్క్ ఉపయోగపడుతుందా.. లేదా అనేది చూడాలి. మహేష్ మినహా అందరూ ఆడవారే ఎలిమినేషన్‌లో ఉన్నారు కాబట్టి.. బిగ్ బాస్ ఈ సీక్రెట్ టాస్క్ రూపంలో మహేష్‌ను సేవ్ చేస్తాడో లేదో తెలియాలి.

ఎలిమినేషన్‌కు గురై.. ఇంటి నుంచి వెళ్ళిపోతున్నట్లు మిగతా సభ్యులను నమ్మించాలి.. ఇది బిగ్ బాస్ మహేష్ విట్టాకు ఇచ్చిన ఆదేశం. దానికి తగ్గట్టుగానే సీరియస్ మోడ్‌లో మహేష్ ప్రవర్తిస్తున్నాడు. బాబా భాస్కర్ అడిగిన క్వశ్చన్‌కు ఏదో ఆన్సర్ ఇచ్చాడు మహేష్. మరి నిజంగానే ఈ సీక్రెట్‌ టాస్క్‌లో గెలిస్తే.. ఈ వారం మహేష్‌ సేవ్‌ అయినట్టేనా? మహేష్‌ ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకుంటాడా? పూర్తి ఎపిసోడ్‌లో చూడాలి.