AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: కెప్టెన్‌గా ఎన్నికైన వితికా.. గొడవపడ్డ రాహుల్-పునర్నవి

రోజు రోజుకి బిగ్ బాస్ 3 షోకి ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతోంది. సరికొత్త టాస్క్‌లతో బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఓ ఆట ఆడిస్తున్నాడు. ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్‌తో పునర్నవి బిగ్ బాస్‌ని ఎదిరించింది. ఇవేం టాస్క్‌లు అంటూ మండిపడింది. బిగ్ బాస్ ఆదేశాలను పాటించను అని తేల్చిచెప్పింది. తోటి సభ్యులు చెప్పినా వినిపించుకోలేదు. కాని చివరికి షూ క్లీన్ చేయడానికి అంగీకరించింది. కెప్టెన్‌గా వితికా ఎన్నికవడం.. రాహుల్, పునర్నవి మధ్య గొడవ జరగడం […]

Bigg Boss Telugu: కెప్టెన్‌గా ఎన్నికైన వితికా.. గొడవపడ్డ రాహుల్-పునర్నవి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 13, 2019 | 10:14 AM

Share

రోజు రోజుకి బిగ్ బాస్ 3 షోకి ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతోంది. సరికొత్త టాస్క్‌లతో బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఓ ఆట ఆడిస్తున్నాడు. ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్‌తో పునర్నవి బిగ్ బాస్‌ని ఎదిరించింది. ఇవేం టాస్క్‌లు అంటూ మండిపడింది. బిగ్ బాస్ ఆదేశాలను పాటించను అని తేల్చిచెప్పింది. తోటి సభ్యులు చెప్పినా వినిపించుకోలేదు. కాని చివరికి షూ క్లీన్ చేయడానికి అంగీకరించింది. కెప్టెన్‌గా వితికా ఎన్నికవడం.. రాహుల్, పునర్నవి మధ్య గొడవ జరగడం గురువారం ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది.

ఎనిమిదో వారంలో వితికా షెరు బిగ్ బాస్ ఇంటి కెప్టెన్‌గా ఎన్నికైంది. బరువులెత్తగలవా.. జెండా పాతగలవా అనే కెప్టెన్సీ టాస్క్‌కు వితికా, శ్రీముఖి, మహేష్ పోటీ పడ్డారు. వరుణ్, రవి, శివజ్యోతిలు వీరికి హెల్ప్ చేశారు. మొత్తానికి చివరికి వితికా అందరి కంటే ఎక్కువ జెండాలను పాతి విన్నర్‌గా నిలిచింది. ఇంకేముందు తన భర్త చేతులమీదుగా విన్నర్‌గా ఎన్నిక కావడంతో సంతోషంతో ఎగిరి గంతులేసింది. ఇక ఈ టాస్క్ మొదలవకముందు.. వితికాకు సహాయం చేస్తాను అనగా.. ఎప్పుడు చెయ్యి నొప్పి, కాలు నొప్పి అంటావ్ నీకెందుకు అని పునర్నవి అంది. అయితే టాస్క్‌ అయిన తర్వాత దీనికి గురించి పునర్నవి, వితికా, వరుణ్ చర్చించికుంటూ ఉండగా.. రాహుల్ మధ్యలో వచ్చాడు. నన్ను ఎందుకు అలా అన్నావ్ అంటూ పునర్నవి మీద ఫైర్ అయ్యాడు. దీంతో నువ్వు చేయలేవు కాబట్టే అలా అన్నాను అంటూ రివర్స్ కౌంటర్ వేసింది. అయినా అందరి ముందు ఎలా అంటావ్ అని కాస్త కోపంగా అన్నాడు. వీరిమధ్య గొడవలు కామనే కదా అనుకుంటూ వితికా రాహుల్‌‌ని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లింది. ఇక శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..