శిల్పా ఎలిమినేటెడ్.. అలీ రీ-ఎంట్రీ.?

శిల్పా ఎలిమినేటెడ్.. అలీ రీ-ఎంట్రీ.?

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 ఎనిమిదో వారం చివరికి చేరుకుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం తెలియనుంది. అయితే ఎప్పటిలానే ఒక రోజు ముందుగానే హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరన్నది సోషల్ మీడియాలో అనధికారికంగా తెలిసిపోయింది. లీకులు ఎవరు చేస్తున్నారో పక్కన పెడితే.. ఉత్కంఠగా సాగాల్సిన ఎలిమినేషన్ ప్రక్రియ.. అందుకు భిన్నంగా జరుగుతుండటంతో ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇది ఇలా ఉండగా ఎనిమిదో […]

Ravi Kiran

|

Sep 14, 2019 | 8:55 PM

అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 ఎనిమిదో వారం చివరికి చేరుకుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం తెలియనుంది. అయితే ఎప్పటిలానే ఒక రోజు ముందుగానే హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరన్నది సోషల్ మీడియాలో అనధికారికంగా తెలిసిపోయింది. లీకులు ఎవరు చేస్తున్నారో పక్కన పెడితే.. ఉత్కంఠగా సాగాల్సిన ఎలిమినేషన్ ప్రక్రియ.. అందుకు భిన్నంగా జరుగుతుండటంతో ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఇది ఇలా ఉండగా ఎనిమిదో వారం ఎలిమినేషన్‌కు గురయ్యే కంటెస్టెంట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి అని తెలుస్తోంది. వచ్చిన వారమే తనను నామినేట్ చేసేందుకు వీలుండదు కాబట్టి రెండో వారంలో ఇంటి సభ్యులందరూ ఒకే కారణంతో ఆమెను నామినేట్ చేశారు. దీనితో శిల్పా ఎలిమినేషన్ తప్పదనిపిస్తోంది. అయితే అధికారికంగా ఈ విషయం తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

మరోవైపు ఇంటి నుంచి బయటికి వెళ్లిన సభ్యుల్లో ఒకరు హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం వైల్డ్ కార్డులో అలీ రెజా రీ-ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. షో టీఆర్పీ అతడు వెళ్లిన దగ్గర నుంచి తగ్గడంతో నిర్వాహకులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మరి చూడాలి ఇది ఎంతవరకు నిజమో.?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu