హౌస్‌మేట్స్‌కు నాగ్ సీరియస్ వార్నింగ్.. ఎందుకంటే..?
బిగ్ బాస్ తెలుగు 3 సక్సస్ ఫుల్‌గా సాగుతోంది. ఈ వారం ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌లో హౌస్ మేట్స్ కాస్త శృతి మించి ప్రవర్తించారు. ఇంకేముందు శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున అందరికి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇక పునర్నవి, మహేష్‌లు బిగ్ బాస్‌కే రివర్స్ అయ్యారు. వీళిద్దరికీ తగిన బుద్ది చెప్పేలా నాగ్ బిగ్ బాస్ స్టేజ్‌పై షూ పాలిష్ చేశాడు. ఏ పనై అయినా చిన్నది కాదు. చేసే పని బట్టి మనిషి […]
బిగ్ బాస్ తెలుగు 3 సక్సస్ ఫుల్‌గా సాగుతోంది. ఈ వారం ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌లో హౌస్ మేట్స్ కాస్త శృతి మించి ప్రవర్తించారు. ఇంకేముందు శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున అందరికి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇక పునర్నవి, మహేష్‌లు బిగ్ బాస్‌కే రివర్స్ అయ్యారు. వీళిద్దరికీ తగిన బుద్ది చెప్పేలా నాగ్ బిగ్ బాస్ స్టేజ్‌పై షూ పాలిష్ చేశాడు. ఏ పనై అయినా చిన్నది కాదు. చేసే పని బట్టి మనిషి స్థాయి తగ్గడం, పెరగడం ఉండదు. చేసే తీరు బట్టి ఉంటుంది అంటూ హౌజ్‌మేట్స్ పై నాగ్ సీరియస్ అయ్యారు.
ఇక శ్రీముఖిపై కూడా ఫుల్ సీరియస్ అయ్యారు. నువ్వు ఏమైనా హౌజ్‌కి బిగ్ బాస్ అనుకుంటున్నావా..? నువ్వు ఆడకుండా పక్క వాళ్ళని కూడా చెడగొట్టడం మంచి పద్దతి అనుకుంటున్నావా అంటూ ఆమెకి చురకలంటించారు. రూల్స్ సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆడావని, అందుకే పునర్నవికి కోపం వచ్చిందని.. రూల్స్‌ను ఫాలో అవుతూ గేమ్ ఆడాలని శిల్పాకు సూచించాడు. ఇక బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా క్లోజ్‌గా ఉంటున్న పునర్నవి, రాహుల్ మధ్య చాలా మనస్పర్దలు వచ్చాయి. టాస్క్‌లో గేమ్ ఆడలేనని పునర్నవి రెచ్చగొట్టడం తనకి నచ్చలేదని రాహుల్ చెప్పగా, నేను కామన్‌గా చెప్పాను తప్ప అందులో వేరే అర్ధం లేదని పునర్నవి వివరణ ఇచ్చింది. చిన్న విషయాన్నైన చాంతాడు అంత లాగే పునర్నవి ఈ వివాదం వలన రాహుల్‌తో ఫ్రెండ్షిప్‌కి బ్రేక్ పెట్టేస్టింది. అనంతరం నామినేషన్‌లో ఉన్న హిమజ, శ్రీముఖి, శిల్పా చక్రవర్తి, మహేష్, పునర్నవిలలో హిమజ సేవ్ అయినట్టు నాగార్జున పేర్కొన్నారు. మిగతా వారిలో ఒకరు ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి రానున్నారు.