అఖిల్ నేను ముందే డీల్ మాట్లాడుకున్నాం.. మెహబూబ్ చేసిన సైగలు అర్ధం చెప్పిన సోహెల్

బిగ్ బాస్ సీజన్ 4 లో అంటులెంజి అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా మెగాస్టార్ నుంచి ఆఫర్ అనుకున్నాడు సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్.

అఖిల్ నేను ముందే డీల్ మాట్లాడుకున్నాం.. మెహబూబ్ చేసిన సైగలు అర్ధం చెప్పిన సోహెల్
Rajeev Rayala

|

Dec 27, 2020 | 6:19 PM

బిగ్ బాస్ సీజన్ 4 లో అంతులేని అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా మెగాస్టార్ నుంచి ఆఫర్ అందుకున్నాడు సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్. తాజాగా టీవీ9 తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపాడు సోహెల్. “బిగ్ బాస్ లో జీరో నుంచి స్టార్ట్ అయ్యా.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న చాలా సంతోషంగా ఉంది. నన్ను సపోర్ట్ చేసిన అందరికి చాలా థాంక్స్.  . సింగరేణి కార్మికుడి కొడుకుగా నేను ఎదిగిన. నన్ను మానాన్న ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నాకు 30 ఏళ్ళు వచ్చే వరకు టైం ఇవ్వమని మా నాన్నని అడిగిన.. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నా.. చాలా ఆనందంగా ఉంది. ఇదంతా ప్రేక్షకులు, బిగ్ బాస్ వల్లే. నాజీవితంలో బిగ్ బాస్ ను మరిచిపోలేను. మేము ముగ్గురం (సోహెల్, అభిజీత్, అఖిల్) చాలా హ్యాపీగా ఉన్నాం. నేను అఖిల్ ముందే అనుకున్నాం 50 లక్షలు వస్తే ఇద్దరం పంచుకుందాం అని అనుకున్నాం అని సోహెల్ తెలిపాడు. ఒకవేళ ఒక్కరే గెలిస్తే  బైక్, ల్యాప్ టాప్ కొనివ్వాలని డీల్ చేసుకున్నాం. అలాగే అభిజీత్ చివరి నాలుగు వారాల్లో చాలా క్లోజ్ అయ్యాడు.

అఖిల్ మొదటినుంచి టాప్ 2 కి వెళ్ళాలి అనేవాడు. అక్కడ 25 లక్షలు వచ్చాయి కాబట్టి నేను తీసుకున్న. అఖిల్ ఫస్ట్ నుంచి టాప్ 2 టాప్ 2 అంటూ వచ్చాడు అనుకున్నట్టే టాప్ 2 అయ్యాడు. అని సోహెల్ తెలిపాడు. ఇక మెగాస్టార్ చిరజీవి గారు నా సినిమాలో చేస్తా అన్నప్పుడు నాకేమి అర్ధం కాలేదు. అది నాకు గోల్డెన్ ఛాన్స్ కాదు డైమెండ్ ఛాన్స్ అనే చెప్పాలి. మంచి సినిమా చేయాలి. అందులో చిరంజీవి గెస్ట్ రోల్ చేయాలి అందుకోసం మంచి కథలు వింటున్నా అని అన్నాడు సోహెల్. ఇక ‘కథ వేరే ఉంటది’ అనే టైటిల్ కోసం ట్రైచేస్తున్న ఆ టైటిల్ ను ఎవరో రిజిస్టర్ చేసుకున్నారట. కానీ అది నాకిస్తే బాగుంటుంది. నేను సినిమా చేస్తే చిన్నవాళ్ళదగ్గరనుంచి పెద్దవాళ్ళ వరకు అలరించేలా సినిమాలు చేస్తా.. జీవితంలో సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కోసమే ప్రయత్నిస్తా” అని తెలిపాడు సోహెల్.

ఇక మెహబూబ్ చేసిన సైగలగురించి మాట్లాడుతూ.. మెహబూబు హౌస్ లోకి వచ్చినప్పుడు మా సోషల్ మీడియా ఫాలోవర్స్ గురించి అడిగి తెలుసుకున్నాం అంతే. బయట ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నాం. అయితే మాముగ్గురిని చూపించి బాగా ఆడుతున్నారు. మీకు మంచి క్రేజ్ ఉందని చెప్పాడు. మెహబూబ్ కు అక్కడ అంత ఏమౌట్ ఉంటుందని తెలియదు. అలాగే ఎవ్వరు గెలుస్తారని ఎవ్వరికి తెలియదు అలాంటప్పుడు మెహబూబ్ కు ఎలా తెలుస్తుంది. మెహబూబ్ కేవలం డబ్బులు గెలుచుకొని రండి అని మాత్రమే చెప్పాడు. ఒకవేళ నిజంగా మెహబూబ్ చెప్పినట్టు నేను డబ్బులు తీసుకోవాలి అంటే అక్కడ 20 లక్షలు ఇచ్చినప్పుడే తీసుకోవాలి కానీ నేను అలా తీసుకోలేదు. అక్కడ 5 లక్షలు పెరిగి 25 లక్షలు అయినప్పుడు నేను తీసుకున్న. అంతకు ముందే   25 లక్షలు వస్తే నేను తీసుకుంటా అని అఖిల్ కు చెప్పాను. నా కెరియర్ మీద ఒట్టువేసి చెప్తున్నా అంటూ వివరణ ఇచ్చాడు సోహెల్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu