బిగ్ బాస్ ఎలిమినేషన్.. ప్రేమ జంట విడిపోనున్నారా.?
బిగ్ బాస్ సీజన్ 3కి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. షో ప్రారంభానికి ముందు వివాదాలు నెలకొనడంతో ఈ సారి ఎలా ఉంటుందో అనుకున్నారు. కాని ప్రేక్షకులు ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తున్నారు. రేటింగ్స్ కూడా అదిరిపోయేలా వస్తున్నాయి. ఇక షో స్టార్ట్ అయినప్పటి నుంచి హేమ, జాఫర్, తమన్నా బయటికి వచ్చేశారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కు ఏకంగా ఏడుగురు ఇంటిసభ్యులు నామినేట్ అయ్యారు. దాంతో ఈ సారి ఎవరు ఇంటి నుంచి […]
బిగ్ బాస్ సీజన్ 3కి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. షో ప్రారంభానికి ముందు వివాదాలు నెలకొనడంతో ఈ సారి ఎలా ఉంటుందో అనుకున్నారు. కాని ప్రేక్షకులు ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తున్నారు. రేటింగ్స్ కూడా అదిరిపోయేలా వస్తున్నాయి. ఇక షో స్టార్ట్ అయినప్పటి నుంచి హేమ, జాఫర్, తమన్నా బయటికి వచ్చేశారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కు ఏకంగా ఏడుగురు ఇంటిసభ్యులు నామినేట్ అయ్యారు. దాంతో ఈ సారి ఎవరు ఇంటి నుంచి బయటికి వస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రకారం చూస్తే నామినేషన్‌లో ఉన్న ఏడుగురిలో ఇద్దరు మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో ఎలిమినేషన్‌లో రవికృష్ణ, శివజ్యోతి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, శ్రీముఖి ఎలిమినేషన్స్‌లో ఉన్నారు. రవికృష్ణ చేతికి గాయం కావడంతో.. గాయానికి కారణం శ్రీముఖి అంటూ బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేసాడు.
ఇక రోహిణి, శివజ్యోతి కూడా కన్ఫెషన్ రూమ్ నుండి బయటికి వచ్చాక నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించటంతో వాళ్లకి పనిష్మెంట్ గా ఇద్దరిని డైరెక్ట్ నామినేట్ చేశాడు బిగ్ బాస్. వరుణ్ సందేష్, బాబా భాస్కర్, శ్రీముఖి ఓట్ల విషయంలో ముందున్నారు. ఇక రవికృష్ణ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిణి, రాహుల్ విషయానికొస్తే వీరిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా వెళిపోతారని బిగ్ బాస్ ఇంట్లోని మిగతా సభ్యులు కూడా అనుకుంటున్నారు. రోహిణి పై.. పెద్దగా ఎంటర్ టైన్ చేయడం లేదనే టాక్ ఉంది. ఇక రాహుల్ విషయంలో అయితే ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడని.. శ్రీముఖిని తిట్టడం.. ఎప్పుడు పునర్నవి వెంట తిరుగుతూ ఉంటాడని అనుకుంటున్నారు. రాహుల్ మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకూ పునర్నవిని పడేయడానికి ఏదో పులిహోర కబుర్లు చెబుతూనే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే మెల్లగా పునర్నవి కూడా ఇన్ డైరెక్ట్‌గా రాహుల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. వీరి ప్రేమ పట్టాలెక్కిందని కూడా అందరూ అనుకుంటున్నారు. ఈ సమయంలో రాహుల్ ఎలిమినేట్ అయితే ప్రేమ జంట విడిపోవడం ఖాయం. చూద్దాం ఈ ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి వెళతారో..