హౌస్ లో రక్షాబంధన్.. రాహుల్ కు షాక్ ఇచ్చిన పునర్నవి..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నాలుగో వారం చివరికి చేరుకుంది. అల్లర్లు, గొడవలు, కాస్త ఎంజాయ్ మెంట్ అలా సాగుతోంది. మొత్తానికి బిగ్ ఇంటి సభ్యులు చేస్తున్న సందడి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు. ముందు వంటగదిలో శ్రీముఖి.. బాబా భాస్కర్‌ల మధ్య వంటనూనె విషయంపై సరదా చర్చ నడిచింది. గత వారం ఐదు లీటర్ల నూనె ఇచ్చి ఇప్పుడు రెండు […]

హౌస్ లో రక్షాబంధన్.. రాహుల్ కు షాక్ ఇచ్చిన పునర్నవి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 17, 2019 | 9:40 AM

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నాలుగో వారం చివరికి చేరుకుంది. అల్లర్లు, గొడవలు, కాస్త ఎంజాయ్ మెంట్ అలా సాగుతోంది. మొత్తానికి బిగ్ ఇంటి సభ్యులు చేస్తున్న సందడి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు. ముందు వంటగదిలో శ్రీముఖి.. బాబా భాస్కర్‌ల మధ్య వంటనూనె విషయంపై సరదా చర్చ నడిచింది. గత వారం ఐదు లీటర్ల నూనె ఇచ్చి ఇప్పుడు రెండు లీటర్ల నూనె ఇచ్చారు అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది శ్రీముఖి. ఇక డైనింగ్ టేబుల్‌ మీద వితికాతో పాటు రాహుల్-పునర్నవిలు ఒకే ప్లేట్‌లో తింటూ ముచ్చట్లు పెట్టారు. ఇక పునర్నవి.. రాహుల్ తినిపించడంతో మిమ్మల్ని ఇలా చూస్తే మీకు పెళ్లి అవ్వదు అంటూ చురక అంటించింది వితికా షెరు. అయితే ఏ.. తినిపిస్తే తప్పా పెళ్లి కాకపోతే ఏం.. అంటూ కొసరి కొసరి రాహుల్‌కి తినిపించింది పునర్నవి. ఇక రక్షా బంధన్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో రాఖీ సంబరాలు జరిగాయి. కంటెస్టెంట్స్‌కి వాళ్ల ఇంటి దగ్గర నుండి పంపించిన రాఖీలు హౌస్‌లో ఉన్న వాళ్లతో కట్టించుకుని ఎమోషన్ అయ్యారు. తొలుత వరుణ్ సందేశ్‌కి హిమజ రాఖీ కట్టగా.. అలీకి శివజ్యోతి రాఖీ కట్టింది. అయితే శ్రీముఖి మాత్రం మా తమ్ముడు పంపించిన రాఖీని ఎవరితోనూ షేర్ చేసుకోలేను అంటూ బాబా భాస్కర్ మాస్టర్‌తో కట్టించుకుంది. ఇక పునర్నవి వంతు వచ్చింది. హౌస్ లో ఉన్నవాళ్లందరికి రాఖీ శుభాకాంక్షలు ఒక్క రాహుల్‌కి తప్ప అంటూ రాహుల్ లైన్‌లోకి వచ్చినట్లుగా ఇన్ డైరెక్టుగా చెప్పింది. మొత్తానికి శుక్రవారం ఎపిసోడ్‌తో రాహుల్-పునర్నవిల లవ్ ట్రాక్ మెల్లగా పట్టలెక్కింది.

లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
లక్ష పిడకలతో 'భోగి' ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు..
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
ఏపీలో రయ్యుమంటూ దూసుకెళ్తున్న ఫారెన్ బైక్స్.. యువత మరింత ఆసక్తి
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేసుకోండి..
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
NBK: మా బాలయ్య బంగారం.. సంక్రాంతి సినిమాల వారధి..!
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
డైరెక్టర్ సుకుమార్ ఆ స్టార్ హీరోకు వీరాభిమాని..
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
పేలవ ఫాంకి చెక్ పెట్టనున్న కోహ్లీ.. కారణం చెప్పేసిన ఫ్యాన్స్
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
8 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. స్కూల్లోనే కుప్పకూలిన విషాదం..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..
శీతా కాలంలో శరీర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..