హిమజ-రాహుల్ రొమాన్స్.. పున్ను ఎంకరేజ్‌మెంట్

హిమజ-రాహుల్ రొమాన్స్.. పున్ను ఎంకరేజ్‌మెంట్

బిగ్ బాస్‌లో ఈ వారం చాలా ఎంటర్టైన్మెంట్ సాగింది. కాలేజ్ టాస్క్‌లో ఇంటి సభ్యులు ఎవరికి వారు తమ పెర్ఫార్మన్స్‌లతో ఇరగదీశారు. లవ్ టీచర్‌గా బాబా భాస్కర్ కామెడీని పండించగా.. గాసిప్ టీచర్‌గా వితిక అదరగొట్టింది. ఈ క్రమంలో వితిక గాసిప్స్ ఎలా క్రియేట్ చేయాలో.. ఒక్కో ఇంటి సభ్యున్ని పిలిచి అడిగింది. ఇక ఇంటి సభ్యులు తమకు తోచిన విధంగా వెరైటీ గాసిప్స్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే శివజ్యోతి మాత్రం ఏకంగా వరుణ్-వితికలపైనే గాసిప్ […]

Ravi Kiran

|

Sep 20, 2019 | 12:15 PM

బిగ్ బాస్‌లో ఈ వారం చాలా ఎంటర్టైన్మెంట్ సాగింది. కాలేజ్ టాస్క్‌లో ఇంటి సభ్యులు ఎవరికి వారు తమ పెర్ఫార్మన్స్‌లతో ఇరగదీశారు. లవ్ టీచర్‌గా బాబా భాస్కర్ కామెడీని పండించగా.. గాసిప్ టీచర్‌గా వితిక అదరగొట్టింది. ఈ క్రమంలో వితిక గాసిప్స్ ఎలా క్రియేట్ చేయాలో.. ఒక్కో ఇంటి సభ్యున్ని పిలిచి అడిగింది.

ఇక ఇంటి సభ్యులు తమకు తోచిన విధంగా వెరైటీ గాసిప్స్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే శివజ్యోతి మాత్రం ఏకంగా వరుణ్-వితికలపైనే గాసిప్ క్రియేట్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది. వాళ్లిద్దరూ నైట్ బిగ్ బాస్ హౌస్‌లో లైట్లు బంద్ చేసిన తర్వాత బెడ్ షీట్‌లో ఏమోనట అని చెబుతూ… శివజ్యోతి తనదైన శైలిలో గాసిప్ అల్లేసింది. దీనితో వితిక ఒక్కసారిగా తెల్లముఖం వేసుకుంది. అయితే కాసేపటికి తేరుకుని.. బాగా చెప్పావ్ అమ్మా.. వెల్ డన్ అంటూ సాగనంపింది.

ఇక ఈ స్కూల్ టాస్క్ తర్వాత టీచర్లు కాకుండా ఇంట్లో ఉన్న మగ సభ్యులు.. మిగతా మహిళా సభ్యుల్లో ఒక్కరిని ఎంచుకుని లవ్ ప్రపోజల్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు. మహేష్ విట్టా ఒకసారి పునర్నవికి.. మరోసారి శివజ్యోతికి కామెడీగా ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత రవి.. శ్రీముఖికి ప్రపోజ్ చేయగా.. రాహుల్ ఊహించని విధంగా పునర్నవికి కాకుండా హిమజకు లవ్ ప్రపోజ్ చేశాడు. ఇక వీరందరిలో రాహుల్-హిమజల ప్రపోజల్ బాగుందని టీచర్లుగా ఉన్న బాబా, వితికాలు ప్రకటించారు.

ఆ తర్వాత ఈ జంట ‘మనోహర నా హృదయమునే’ అంటూ రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్స్ చేశారు. రాహుల్ కొంచెం మొహమాటం పడగా…హిమజ మాత్రం పాటకు తగ్గట్టుగా రొమాంటిక్ డ్యాన్స్ చేసింది. అటు వీరిద్దరి రొమాన్స్ చూసి పునర్నవి ఎంకరేజ్ చేస్తూ.. కేకలు పెట్టగా.. రాహుల్ ఆ ఊపుతో రెచ్చిపోయాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu