AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లామర్ బ్యూటీలతో ‘హౌస్’ ఫుల్లు.. కుర్రాళ్ల గుండెలకు చిల్లు!

బుల్లితెరపై ఎన్నో వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్‌గా మారింది ‘బిగ్ బాస్’ రియాలిటీ షో. మొదట హిందీలో ప్రారంభమైన ఈ షో.. ఆ తర్వాత మరాఠీతో పాటుగా దక్షిణాది భాషల్లో కూడా టెలికాస్ట్ కావడం జరిగింది. కాంట్రావర్సీలు ఎన్ని ఉన్నా.. ఈ షోకు ప్రేక్షకాదరణ మాత్రం విపరీతంగా లభిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాషల్లోనూ షో చివరి అంకంకు చేరుకుంది. ఇక హిందీలో అయితే పదమూడో సీజన్ […]

గ్లామర్ బ్యూటీలతో 'హౌస్' ఫుల్లు.. కుర్రాళ్ల గుండెలకు చిల్లు!
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 3:24 PM

Share

బుల్లితెరపై ఎన్నో వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్‌గా మారింది ‘బిగ్ బాస్’ రియాలిటీ షో. మొదట హిందీలో ప్రారంభమైన ఈ షో.. ఆ తర్వాత మరాఠీతో పాటుగా దక్షిణాది భాషల్లో కూడా టెలికాస్ట్ కావడం జరిగింది. కాంట్రావర్సీలు ఎన్ని ఉన్నా.. ఈ షోకు ప్రేక్షకాదరణ మాత్రం విపరీతంగా లభిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాషల్లోనూ షో చివరి అంకంకు చేరుకుంది. ఇక హిందీలో అయితే పదమూడో సీజన్ ఇటీవలే మొదలైంది.

బిగ్ బాస్ హౌస్‌లోకి అన్ని భాషల్లోనూ ప్రముఖ సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరిది డిఫరెంట్ స్టైల్.. కొందరు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మరికొందరు విఫలమవుతుండటం సహజం. ఇక తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిపి ముగ్గురు అందమైన భామలు నెట్టింట్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. వారు లోస్లియా, పునర్నవి, రష్మీ దేశాయ్.

లోస్లియా:

శ్రీలంకకు చెందిన లోస్లియా.. తన కెరీర్‌ను న్యూస్ టీవీ యాంకర్‌గా ప్రారంభించింది. అనూహ్య రీతిలో తమిళ బిగ్ బాస్‌ నుంచి ఆఫర్ రావడంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే తనదైన శైలి ప్రవర్తనతో.. అంతేకాక లోస్లియా- కెవిన్ మధ్య ప్రేమాయణం కూడా కురాళ్లను అమితంగా ఆకట్టుకుంది. దీనితో యువత ఆమె పట్ల ఆకర్షితులు అయ్యారు. అంటే ఒక్కసారిగా ఆమె పేరు మీద సోషల్ మీడియాలో ఆర్మీలు ఏర్పడ్డాయి. లోస్లియా ఎలిమినేషన్‌లోకి వచ్చిన ప్రతిసారి ఆమె అభిమానులు హయ్యెస్ట్ ఓటింగ్ వేసి మరీ సేఫ్ జోన్‌కు తెస్తున్నారు. ఇలా తంబీలకు బాగా చేరువైన ఈ అందాల భామ ఇప్పుడు ఫైనల్ నలుగురు కంటెస్టెంట్లలో ఒకరు. ఆమె ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ గెలవాలని చాలామంది యువత కోరుకుంటున్నారని చెప్పొచ్చు.

పునర్నవి:

తెలుగు బిగ్ బాస్‌లో తనదైన అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో నటి పునర్నవి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో చురుకుగా పార్టిసిపేట్ చేయకపోతున్నా.. రాహుల్‌తో సాగిస్తున్న ప్రేమ కానీ స్నేహబంధం యువతను ఆమె పట్ల బాగా ఎట్రాక్ట్ చేసింది. అంతేకాక హౌస్‌లో పునర్నవికి వరుణ్ సందేశ్, వితిక షేరు, రాహుల్‌ స్నేహితులు. ఆమెకి ఎక్కడా కూడా కష్టం కలగకుండా వీరు ఇప్పటివరకు చూసుకుంటూ వచ్చారు. ఈ వారం ఆమె ఎలిమినేషన్‌కు నామినేట్ అయినా.. దాదాపు సేఫ్ జోన్‌లో ఉందనే టాక్ వినిపిస్తోంది.

రష్మీ దేశాయ్:

బుల్లితెరపై ‘ఉత్తరన్’ అనే సీరియల్‌తో నటి రష్మీ దేశాయ్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఝలక్ ధికలాజా, నచ్ బలియే వంటి రియాలిటీ షో‌తో కూడా నార్త్ ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 13లో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తన బ్రేకప్ లవర్ సిద్ధార్థ్ శుక్లాతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇది ఇలా ఉంటే రష్మీకి బిగ్ బాస్‌లో భారీ పారితోషికం ముట్టినట్లు సమాచారం. అంతేకాక సిద్ధార్థ్, రష్మీ మధ్య ఆసక్తికరమైన సంఘటనలు ఏం జరుగుతాయని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. కాబట్టి ఈ సీజన్‌లో ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Follow Us
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్
కోహ్లీతో సహా క్యూ కట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. 3 వికెట్లు డౌన్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్