నాగ్-చిరు దెబ్బకు రికార్డులు బ్రేక్.. రేటింగ్‌ చూస్తే దిమ్మతిరగాల్సిందే..

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో.. బుల్లి తెరపై తనదైన ముద్రను వేసుకుంది. తాజాగా సీజన్3 ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్3 గ్రాండ్ ఫినాలే అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంది. తొలి రెండు సీజన్లలో జూనియర్ ఎన్టీఆర్, నానీలు హోస్ట్‌గా వ్యవహరిస్తే.. సీజన్3కి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఈ సీజన్ ఫైనల్స్.. నాగ్-చిరూ కాంబినేషన్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ గ్రాండ్‌ ఫినాలే టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అంతేకాదు.. తొలి రెండు సీజన్‌ల […]

నాగ్-చిరు దెబ్బకు రికార్డులు బ్రేక్.. రేటింగ్‌ చూస్తే దిమ్మతిరగాల్సిందే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 15, 2019 | 4:39 AM

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో.. బుల్లి తెరపై తనదైన ముద్రను వేసుకుంది. తాజాగా సీజన్3 ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్3 గ్రాండ్ ఫినాలే అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంది. తొలి రెండు సీజన్లలో జూనియర్ ఎన్టీఆర్, నానీలు హోస్ట్‌గా వ్యవహరిస్తే.. సీజన్3కి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఈ సీజన్ ఫైనల్స్.. నాగ్-చిరూ కాంబినేషన్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ గ్రాండ్‌ ఫినాలే టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అంతేకాదు.. తొలి రెండు సీజన్‌ల ఫైనల్స్‌ను పొల్చిచూస్తే.. సీజన్‌ 3 టీఆర్పీ వాటిని అధిగమించింది. బిగ్‌బాస్‌ తెలుగు 3 గ్రాండ్‌ఫినాలేను నవంబర్‌ 3న స్టార్‌ మా ప్రసారం చేసింది. ఫైనల్‌ రేసులో శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజాల నుంచి టఫ్‌ ఫైట్‌ ఎదుర్కొని.. రాహుల్‌ సిప్లీగంజ్‌ బిగ్‌బాస్‌3 టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 గ్రాండ్‌ఫినాలే టీఆర్పీలు వెల్లడవ్వడంతో.. ఫైనల్‌ ఎపిసోడ్‌ ఏ రేంజ్‌లో అందర్నీ ఆకట్టుకుందో తెలిసిపోతోంది.

మొత్తం నాలుగున్నర గంటల పాటు సాగిన.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌.. 18.29 టీఆర్పీ రాబట్టిందని బిగ్‌బాస్‌ షో నిర్మాతలైన ఎండెమోల్‌ షైన్‌ ఇండియా ట్వీట్‌‌లో పేర్కొంది. అంతేకాదు దేశవ్యాప్తంగా అత్యధిక టీఆర్పీ నమోదు చేసిన బిగ్‌బాస్‌ షో ఇదేనంటూ ఆ ట్వీట్‌‌లో పేర్కొంది. ఇక బిగ్‌బాస్1 గ్రాండ్ ఫినాలేకు 14.13 టీఆర్పీ రాగా.. నాని ప్రెజెంట్‌ చేసిన సీజన్‌ 2 గ్రాండ్ ఫినాలేకు 15.05 టీఆర్పీ వచ్చింది. ఇక క్లైమాక్స్‌లో చిరూ బిగ్‌బాస్ టైటిల్ అందించే చివరి గంటలో ఏకంగా 22.4 టీఆర్పీ నమోదైనట్టు స్టార్‌ మా నెట్‌వర్క్‌ ఉద్యోగి ఒకరు తెలిపారు.