బిగ్‌బాస్ 3: హాట్ టాపిక్‌గా రాహుల్-పునర్నవి కిస్ సీన్
తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక గత రెండు సీజన్‌లతో పోలీస్తే ఈ సీజన్‌లో లవ్ మసాలా కూడా బాగా పెరిగింది. ఈ సారి హౌజ్‌లో రియల్ కపుల్ వరుణ్-వితిక ఉన్నప్పటికీ.. వారి కంటే రాహుల్-పునర్నవి మధ్య కెమిస్ట్రీ రోజురోజుకు పెరిగిపోతోంది. తాజా ఎపిసోడ్‌లో పునర్నవి రాహుల్‌ను హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ సీన్‌పై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్, కామెంట్స్ వైరల్ […]
తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక గత రెండు సీజన్‌లతో పోలీస్తే ఈ సీజన్‌లో లవ్ మసాలా కూడా బాగా పెరిగింది. ఈ సారి హౌజ్‌లో రియల్ కపుల్ వరుణ్-వితిక ఉన్నప్పటికీ.. వారి కంటే రాహుల్-పునర్నవి మధ్య కెమిస్ట్రీ రోజురోజుకు పెరిగిపోతోంది. తాజా ఎపిసోడ్‌లో పునర్నవి రాహుల్‌ను హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ సీన్‌పై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్, కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజా ఎపిసోడ్‌లో పునర్నవి కోసం ఇరవై గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను తాగమని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో అన్ని గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను విజయవంతంగా తాగి పునర్నవి అనుమానాలు పటాపంచలు చేశాడు రాహుల్. మొదట కాస్త కష్టంగానే అనిపించినా.. ఆ టాస్క్‌ను అతడు పూర్తి చేసేశాడు. దీంతో పునర్నవికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. వెంటనే అంతుపట్టని సంతోషంతో.. రాహుల్‌ను హగ్ చేసుకుని, ముద్దు పెట్టింది. దీంతో రాహుల్ సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.
అయితే హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకరిపై మరొకరు ప్రేమను చూపిస్తూ పలుమార్లు కెమెరాకు చిక్కారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో రాహుల్‌పై పునర్నవి కామెంట్లు చేసింది. వితికాను ఎత్తుకుని పరిగెత్తే విషయమై.. వారంతా చర్చించుకుంటూ ఉంటే.. చేయి నొప్పి, కాలు నొప్పి అంటావ్ టాస్క్ నీకవసరమా? అంటూ రాహుల్‌ను ఉద్దేశించి పునర్నవి కామెంట్లు చేసింది. దీంతో వారిద్దరి మధ్య దూరం రాగా.. వీకెండ్ ఎపిసోడ్‌లో అది ఇంకాస్త పెరిగింది. ఈ దూరాన్ని తగ్గించేందుకే బిగ్‌బాస్ ఈ టాస్క్‌ను ఇచ్చాడని సోషల్ మీడియాలో పలువురు ట్వీట్లు పెడుతున్నారు.