AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్: రేటింగ్స్ పెంచుకోవడానికి ఎలిమినేషన్స్ తప్పవా.?

మొదటి రెండు సీజన్ల మాదిరిగానే తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ కూడా సోసోగా రన్ అవుతోందని చెప్పవచ్చు. షో ఓపెనింగ్‌లో హ్యయస్ట్ టీఆర్పీ సంపాదించుకున్నా.. ప్రస్తుతం షో మునపటిలా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ఇక ఎలిమినేషన్స్ విషయానికి వస్తే.. ఒక్కరోజు ముందుగానే సోషల్ మీడియాలో లీకవుతుండటంతో జనాల్లో షో పట్ల ఆసక్తి తగ్గుతోంది. సోమవారం ఎలిమినేషన్ ప్రాసెస్‌కు నామినేషన్స్ జరుగుతాయి. ఇక అక్కడ నుంచీ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దానిపై నెట్టింట్లో అదే హాట్ టాపిక్. […]

బిగ్ బాస్: రేటింగ్స్ పెంచుకోవడానికి ఎలిమినేషన్స్ తప్పవా.?
Ravi Kiran
|

Updated on: Sep 16, 2019 | 4:04 PM

Share

మొదటి రెండు సీజన్ల మాదిరిగానే తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ కూడా సోసోగా రన్ అవుతోందని చెప్పవచ్చు. షో ఓపెనింగ్‌లో హ్యయస్ట్ టీఆర్పీ సంపాదించుకున్నా.. ప్రస్తుతం షో మునపటిలా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ఇక ఎలిమినేషన్స్ విషయానికి వస్తే.. ఒక్కరోజు ముందుగానే సోషల్ మీడియాలో లీకవుతుండటంతో జనాల్లో షో పట్ల ఆసక్తి తగ్గుతోంది. సోమవారం ఎలిమినేషన్ ప్రాసెస్‌కు నామినేషన్స్ జరుగుతాయి. ఇక అక్కడ నుంచీ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దానిపై నెట్టింట్లో అదే హాట్ టాపిక్.

ఈ సీజన్ విషయానికి వస్తే.. షో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎక్కువ శాతం మొదటిసారి నామినేట్ అయినవారే ఎలిమినేట్ అవుతున్నారు. మొదటివారంలో హేమ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, అలీ రెజా ఇలా అందరూ కూడా మొదటిసారే ఎలిమినేట్ అయ్యారు. అలాగే ఈ వారం కూడా వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన శిల్పా చక్రవర్తి తన మొదటి ఎలిమినేషన్ నామినేషన్స్‌లోనే వెళ్లి పోయింది.

వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన మొదటివారం ఎవరూ ఆమెను నామినేట్ చెయ్యరు. ఇక రెండోవారం హౌస్‌లోని ఎక్కువమంది ఆమెను నామినేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే శిల్పా ఎలిమినేషన్స్‌లోకి వచ్చిందో అప్పుడే ఆమె ఎగ్జిట్ కన్ఫర్మ్ అని చాలామంది భావించారు. అనుకున్నట్లుగానే ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ నాగార్జున నిన్నటి ఎపిసోడ్‌లో శిల్పా చక్రవర్తి ఎలిమినేటెడ్ అని ప్రకటించాడు.

గత రెండు సీజన్లను కూడా ఒకసారి పరిశీలిస్తే.. ఎవరైతే ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళను హౌస్‌లో ఉంచి.. మిగిలిన వారిని ఎలిమినేట్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ షో పూర్తి స్క్రిప్ట్‌డ్గా ప్రసారమవుతోంది ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోంది.

Follow Us
ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు.. వీరికి మాత్రమే ఛాన్స్..
సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు.. వీరికి మాత్రమే ఛాన్స్..
ఇంద్రుని తోటలోని ఈ మొక్క మీ ఇంటి అదృష్టాన్ని మార్చివేస్తుంది..!
ఇంద్రుని తోటలోని ఈ మొక్క మీ ఇంటి అదృష్టాన్ని మార్చివేస్తుంది..!
ఏ పథకంలో అత్యధిక వడ్డీ రేటు ఉంది? మీరు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత?
ఏ పథకంలో అత్యధిక వడ్డీ రేటు ఉంది? మీరు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత?
అప్పుడు అల్లు అర్జున్, చిరంజీవి ఇంటికి పని చేశాడు.. ఇప్పుడు
అప్పుడు అల్లు అర్జున్, చిరంజీవి ఇంటికి పని చేశాడు.. ఇప్పుడు
హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు..
హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు..
చికెన్ పచ్చడి పక్కా కొలతలు గ్రాములతో సహా..
చికెన్ పచ్చడి పక్కా కొలతలు గ్రాములతో సహా..
బీసీలకు అదిరిపోయే శుభవార్త.. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్
బీసీలకు అదిరిపోయే శుభవార్త.. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్
తేలు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...
తేలు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...
కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?
కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?