‘బిగ్‌బాస్’ వివాదం: నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్థులు

రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్‌ ఈ ఆదివారం నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే షో ప్రారంభం కాకముందే దీనిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని, సభ్యులను ఇబ్బంది పెడుతున్నారంటూ.. యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా కోర్టులో కేసులు వేశారు. మరోవైపు బిగ్‌బాస్ షోను రద్దు చేయాలంటూ ఉస్మానియా విద్యార్థులు హెచ్చరించారు. ఈ షో మీద మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన వారు.. షోను […]

‘బిగ్‌బాస్’ వివాదం: నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ విద్యార్థులు
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 12:27 PM

రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్‌ ఈ ఆదివారం నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే షో ప్రారంభం కాకముందే దీనిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని, సభ్యులను ఇబ్బంది పెడుతున్నారంటూ.. యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా కోర్టులో కేసులు వేశారు. మరోవైపు బిగ్‌బాస్ షోను రద్దు చేయాలంటూ ఉస్మానియా విద్యార్థులు హెచ్చరించారు.

ఈ షో మీద మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన వారు.. షోను ఆపాలని పేర్కొన్నారు. లేదంటే షో వ్యాఖ్యతగా వ్యవహరించనున్న నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోను ముట్టడిస్తామని హెచ్చరించారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా షో నిర్వాహకులు రేపటి నుంచి(జూలై 21) బిగ్‌బాస్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కందుల మధు ఆధ్వర్యంలో నాగార్జున ఇంటిని ముట్టడించారు ఓయూ విద్యార్థులు.

‘బిగ్‌బాస్‌ 3’ వివాదంపై ఇద్దరు మహిళలు ఒంటరి పోరాటం చేస్తుంటే, నాగార్జున కనీసం స్పందించలేదని.. మహిళలను కించపరిచే షో కి నాగార్జున ఏ రకంగా హోస్ట్ గా ఉంటారని ఆయన ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మహిళలను కించపరిచే, వేధించే బిగ్ బాస్ లాంటి షో లను విద్యార్థులం వ్యతిరేకిస్తున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.