Bigg Boss 3: ఎలిమినేషన్స్‌లో హైడ్రామా.. బాబా భాస్కర్ కంటతడి!

‘బిగ్ బాస్’ సీజన్ 3 రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆదివారం వస్తే చాలు ఎలిమినేషన్స్‌తో హౌస్‌మేట్స్ క్లాసులు.. సోమవారం అయితే నామినేషన్ ప్రక్రియలో గొడవలతో భలే రక్తి కట్టిస్తున్నారు. అలాగే ఈ ఐదో వారం నామినేషన్స్‌‌లో భాగంగా ఎలిమినేషన్ చేయాల్సిన సభ్యుడికి ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలనీ బిగ్ బాస్ ఆదేశించాడు. దీనిలో భాగంగా పునర్నవి అందరిని ఆశ్చర్యపరుస్తూ రాహుల్‌ని ఎలిమినేట్ చేయగా.. మిగిలిన హౌస్‌మేట్స్‌ కూడా అతడినే టార్గెట్ చేయడం జరిగింది. అటు […]

Bigg Boss 3: ఎలిమినేషన్స్‌లో హైడ్రామా.. బాబా భాస్కర్ కంటతడి!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 19, 2019 | 8:03 PM

‘బిగ్ బాస్’ సీజన్ 3 రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆదివారం వస్తే చాలు ఎలిమినేషన్స్‌తో హౌస్‌మేట్స్ క్లాసులు.. సోమవారం అయితే నామినేషన్ ప్రక్రియలో గొడవలతో భలే రక్తి కట్టిస్తున్నారు. అలాగే ఈ ఐదో వారం నామినేషన్స్‌‌లో భాగంగా ఎలిమినేషన్ చేయాల్సిన సభ్యుడికి ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలనీ బిగ్ బాస్ ఆదేశించాడు. దీనిలో భాగంగా పునర్నవి అందరిని ఆశ్చర్యపరుస్తూ రాహుల్‌ని ఎలిమినేట్ చేయగా.. మిగిలిన హౌస్‌మేట్స్‌ కూడా అతడినే టార్గెట్ చేయడం జరిగింది. అటు హిమజ, పునర్నవి మధ్య ఈ ప్రక్రియలో భాగంగా చిన్న వాగ్వాదం జరిగిందని చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఈ నామినేషన్‌ ప్రక్రియలో బాబా భాస్కర్‌ను నామినేట్‌ చేసినట్టు తెలుస్తోంది. దీనికి గానూ బాబా భాస్కర్‌ కంటతడి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే హౌస్‌మేట్స్‌ చెప్పిన కారణాలకు అతను బాధపడ్డాడా? అంతలా ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నాడు అనేది తెలియాలి. మరికొద్ది గంటల్లో ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఎలిమినేషన్స్‌లో ఎవరు ఉన్నారో తెలిసిపోతుంది.