Bigg Boss 3: రాహుల్‌కి షాక్ ఇచ్చిన పునర్నవి.. హౌస్‌మేట్స్ టార్గెట్ కూడా అతడే!

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 నాలుగు వారాలు పూర్తి చేసుకుని.. ఐదో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం హేమ, ఆ తర్వాత జాఫర్.. మూడో వారం తమన్నా, నాలుగో వారం రోహిణి హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ఇక ప్రస్తుతం 12 మంది సభ్యులు మిగిలారు. ఐదో వారం ఎలిమినేషన్స్ ప్రక్రియలో భాగంగా సోమవారం ఎపిసోడ్‌లో రచ్చ షురూ అయింది. ఇందులో భాగంగా ఎలిమినేషన్‌లో ఉండాలనుకునే వారిని ఎరుపు రంగు పూసి […]

Bigg Boss 3: రాహుల్‌కి షాక్ ఇచ్చిన పునర్నవి.. హౌస్‌మేట్స్ టార్గెట్ కూడా అతడే!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 19, 2019 | 6:24 PM

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 నాలుగు వారాలు పూర్తి చేసుకుని.. ఐదో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం హేమ, ఆ తర్వాత జాఫర్.. మూడో వారం తమన్నా, నాలుగో వారం రోహిణి హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ఇక ప్రస్తుతం 12 మంది సభ్యులు మిగిలారు. ఐదో వారం ఎలిమినేషన్స్ ప్రక్రియలో భాగంగా సోమవారం ఎపిసోడ్‌లో రచ్చ షురూ అయింది.

ఇందులో భాగంగా ఎలిమినేషన్‌లో ఉండాలనుకునే వారిని ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీనితో హౌస్‌మేట్స్ మధ్య వాగ్వాదం మొదలైంది. ఇదంతా ఒక ఎత్తైతే.. అందరిని ఆశ్చర్యపరుస్తూ పునర్నవి.. రాహుల్‌కి రంగు పూసి ఎలిమినేట్ చేయడంతో ఇంటి సభ్యులందరూ ఆశ్చర్యపోయారు. అటు హౌస్‌మేట్స్ అందరూ కూడా రాహుల్‌ని టార్గెట్ చేసి రంగు పూసి ఎలిమినేషన్స్‌లో నామినేట్ చేశారు.

మరోవైపు పునర్నవిని కూడా ఎలిమినేషన్స్‌లో నామినేట్ చేయగా.. ఈ ప్రక్రియలో హిమజ, పునర్నవి మధ్య చిన్న గొడవ కూడా జరిగింది. అటు శ్రీముఖికి ఆషు రెడ్డి పంచ్ ఇచ్చింది. కాగా ఈ వారంలో ఎలిమినేషన్స్‌లో ఎవరు ఉంటారో మరికొద్ది గంటల్లో తేలనుంది.