ఆలీ చేసిన పనికి ‘కన్నీరు మున్నీరైన’ బాబా మాస్టర్..!

తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 3 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. కోపతాపాలు, ఆనందాల మధ్య ఇంటిసభ్యులు ఫుల్‌గా టెన్షన్‌కి గురవుతున్నారు. కాస్త అక్కడక్కడ ట్విస్ట్‌లు కూడా కనిపిస్తున్నాయి. ఇక శనివారం, ఆదివారాలు ఇంటి సభ్యులకు క్లాసులు, ఎలిమినేషన్స్ తప్పవు. కానీ.. సోమవారం వచ్చిందంటే.. కంటెస్టెంట్స్ గుండెల్లో రాళ్లు పడుతున్నాయి. ఎవరిని ఎలిమినేట్ చేయాలో.. తెలీయక తలలు పట్టుకుంటున్నారు. నీది తప్పంటే.. నీది తప్పని.. వాదించుకుంటున్నారు. ఇదే సరైన పాయింట్‌ అని.. ఆ గొడవలు.. ఎలిమినేషన్స్‌ రౌండ్‌లోకి తీసుకొచ్చి.. ఇంటి […]

ఆలీ చేసిన పనికి 'కన్నీరు మున్నీరైన' బాబా మాస్టర్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 20, 2019 | 8:34 AM

తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 3 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. కోపతాపాలు, ఆనందాల మధ్య ఇంటిసభ్యులు ఫుల్‌గా టెన్షన్‌కి గురవుతున్నారు. కాస్త అక్కడక్కడ ట్విస్ట్‌లు కూడా కనిపిస్తున్నాయి. ఇక శనివారం, ఆదివారాలు ఇంటి సభ్యులకు క్లాసులు, ఎలిమినేషన్స్ తప్పవు. కానీ.. సోమవారం వచ్చిందంటే.. కంటెస్టెంట్స్ గుండెల్లో రాళ్లు పడుతున్నాయి. ఎవరిని ఎలిమినేట్ చేయాలో.. తెలీయక తలలు పట్టుకుంటున్నారు. నీది తప్పంటే.. నీది తప్పని.. వాదించుకుంటున్నారు. ఇదే సరైన పాయింట్‌ అని.. ఆ గొడవలు.. ఎలిమినేషన్స్‌ రౌండ్‌లోకి తీసుకొచ్చి.. ఇంటి సభ్యులను నామినేటెడ్ చేస్తున్నారు. కాగా.. తాజాగా.. 4వ వారంలో.. రోహిణీ ఎలిమినేట్ అయ్యింది. దానికి కారణం నేనేమో అని శివజ్యోతి తెగ బాధపడింది.

అయితే.. తనను నామినేట్ చేసినందుకు బోరుమన్నారు బాబా మాస్టర్. ఎప్పుడూ హైపర్ యాక్టీవ్‌గా ఉంటూ.. ఇంట్లోని సభ్యులందరినీ నవ్వించే బాబా మాస్టర్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యేసరికి హౌస్‌మెట్స్ అందరూ షాక్ తిన్నారు. కాగా.. ఆలీకి వున్న కెప్టెన్‌ పవర్‌తో.. ఒక ఇంటి సభ్యుడిని నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించగా.. దానికి బాబా మాస్టర్‌ను నామినేట్ చేస్తాడు అలీ. దానికి బాబా మాస్టర్ ఓ రేంజ్‌లో ఫీలయ్యారు. మరొక బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీముఖి వద్ద తన బాధను చెప్తూ.. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇది చూసిన ఇంటి సభ్యులు ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి.. ఒకప్పటి మిత్రులు కూడా.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే.. శత్రువులవడం ఖాయమని.. తెలుస్తోంది. ఎందుకంటే.. అది బిగ్‌బాస్ హౌస్.. అక్కడ ఏమైనా జరగవచ్చు.

కాగా.. ఈవారం ఏడుగురు ఇంటి సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. వారు: పునర్నవి, రాహుల్, హిమజ, అషురెడ్డి, మహేష్, బాబా మాస్టర్, శివజ్యోతిలు. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనేది కాస్త థ్రిల్లింగ్‌ గానే ఉంది.

Bigg Boss 3: Baba Bhaskar Gets Emotional, Ali Nominates Baba Master

Ali Nominates Baba Master