Big News Big Debate: ప్రజా తీర్పునకు సిద్ధమైన పోల్ తెలంగాణ.. ఓటింగ్ శాతంలో సరికొత్త రికార్డు సృష్టిస్తారా?
ప్రజాస్వామ్యంలో ఓటే ప్రజల వద్ద ఉండే అతిపెద్ద ఆయుధం... అదే భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెలంగాణలో ఎన్నికల కమిషన్ ఏర్పాటు సిద్ధం చేసింది. ఇక ఓటేయాల్సిన బాధ్యత పౌరులపైనే ఉంది. ఊరూవాడా జరుగుతున్న ఓట్ల జాతరలో అంతా పాల్గొనలంటోంది ఎన్నికల సంఘం.

గురువారం తెలంగాణ పోలింగ్… ప్రత్యేక రాష్ట్రం సాకారం అయిన తర్వాత ముచ్చటగా జరుగుతున్న మూడో ఎన్నిక. రాజకీయ చైతన్యం ఎక్కువగానే ఉన్న తెలంగాణలో 2014లో 69.5శాతం పొలింగ్ నమోదుకాగా.. 2018లో 73.2శాతం రికార్డు అయింది. ఈ సారి అంతకంటే ఎక్కువ నమోదు లక్ష్యంగా ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలో 3కోట్ల 26లక్షల మంది ఓటర్లున్నారు. ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధికారి వెళ్లి మరీ స్లిప్పులు కూడా పంఇణీ చేశారు. ప్రజాసంఘాలు, మీడియా రూపంలో విస్త్రతంగా ప్రచారం చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. తక్కువ ఓటుశాతం నమోదవుతున్న అర్బన్ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
తెలంగాణలో తొలిసారిగా వోట్ ఫ్రం హోమ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటినుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. అటు పోస్టల్ బ్యాలెట్ కూడా ముందే ముగించారు. ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో పాటు, కేంద్రబలగాలను మోహరించారు. 35 వేల 655 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.
తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఏపీలో సరికొత్త ఆరోపణలు సంచలనంగా మారాయి. రెండు తెలుగురాష్ట్రాల్లో డూప్లికేట్ ఓట్లు లక్షల్లో ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఏపీలోని ప్రభుత్వంలోని పెద్దలు. తెలంగాణలో ఓటు వేసి మళ్లీ ఏపీలో కూడా ఓటేయడానికి కుట్ర జరుగుతుందని ఈసీకి ఫిర్యాదు చేశారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. మరి ఎన్నికల సంఘం కోరుకుంటున్నట్టుగా ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకుని భారీగా ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియలోభాగస్వామ్యమలవుతారా? బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో విశ్లేషణ చూద్దాం…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
