Weekly Horoscope: వార ఫలాలు.. ఈ రాశివారు ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే ఇబ్బందులే..

Subhash Goud

Subhash Goud |

Updated on: Sep 19, 2021 | 8:50 AM

Weekly Horoscope: దైనందన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ఎంతో ప్రమాదంలో పడిపోతుంది..

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ రాశివారు ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే ఇబ్బందులే..

Follow us on

Weekly Horoscope: దైనందన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ఎంతో ప్రమాదంలో పడిపోతుంది. అందుకే ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి ఆతీసుకోవడం మంచిది. చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాలి. అందుకే తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకునేందుకు రాశి ఫలాలను అనుసరిస్తారు. అయితే.. ఈ వారంలో ముఖ్యంగా కొన్ని రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. సెప్టెంబర్‌ 19 నుంచి 25వ తేదీ వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి:

ఈ వారం ఈ రాశివారికి ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పర్చుకుంటారు. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృషభ రాశి:

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత వరకు అర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి.

మిథున రాశి:

ఈ వారం ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు మంచి అకాశాలు ఉంటాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది.

కర్కాటక రాశి:

ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్‌ వస్తు౦ది. ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్ధులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి:

ఈ రాశివారికి ఈ వారంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్‌ విద్యార్ధులకు అనుకూలంగా ఉంది. చేపట్టే కార్యక్రమాలలో మంచి విజయాలు సాధిస్తారు.

కన్య రాశి:

ఈ రాశివారికి ఈ వారం ఆదాయం నిలకడగా ఉంటుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం సమకూరే పనులను చేపడతారు. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

తుల రాశి:

అవసరానికి డబ్బు అందుతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృథా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గాంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి:

అనవసర విషయాలలో జోక్యం కల్పించుకోకపోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

ధనస్సు రాశి:

దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం అందోళన కలిగిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తారు. వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

మకర రాశి:

ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలున్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోకూడదు.

కుంభ రాశి:

ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మీన రాశి:

వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల్లో మాట పట్టింపులు ఏర్పడతాయి. వస్తువు రూపంలో, డబ్బులు రూపంలో నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu