AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay TVK: తమిళనాట విజయ్ ప్రభంజనం.. కొత్త రాజకీయ శక్తిగా టీవీకే

Tamil Nadu Election Results: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే సంచలనం సృష్టిస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కి నెట్టి భారీ ఆధిక్యంతో మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో కొనసాగుతోంది. మార్పును కోరుకున్న తమిళ ఓటర్లు.. కొత్త పార్టీ టీవీకేకు మద్దతు తెలిపినట్లు ఈ ఫలితాలతో స్పష్టమవుతోంది.

Vijay TVK: తమిళనాట విజయ్ ప్రభంజనం.. కొత్త రాజకీయ శక్తిగా టీవీకే
Tvk Vijay
Janardhan Veluru
|

Updated on: May 04, 2026 | 11:25 AM

Share

తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ శక్తిగా నటుడు విజయ్‌ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అవతరించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. బలమైన అధికార డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమిని ఢీకొన్న టీవీకే.. పలు ఎగ్జిట్ పోల్స్ అంచాలను తలకిందులు చేస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తమిళనాడు రాజకీయాలను దశాబ్ధాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు శాసించాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన TVK.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలిచింది. ఈ ఎన్నికల ఫలితాలతో ద్రావిడ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితి నెలకొంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ అయిన టీవీకేకు తమిళ ఓటర్లు పట్టం కట్టారు. విజయ్‌ ప్రచారానికి ఆటంకాలు, సినిమా రిలీజ్‌కి ఇబ్బందులు కలిగాయి. ఈ సవాళ్లను అధిగమించి విజయ్‌ TVK పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటములను వెనక్కి నెట్టి ఆధిక్యంలో నిలిచింది. కొత్త పార్టీకి అవకాశం కల్పిస్తూ.. మార్పును కోరుకున్న తమిళ ఓటర్లు తీర్పు ఇవ్వడం ఈ ఫలితాలతో స్పష్టంగా కనిపిస్తోంది.

తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో సెంచరీ మార్క్‌ను దాటిన టీవీకే.. 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నాడీఎంకే కూటమి 74 స్థానాల్లో ముందంజలో నిలవగా.. డీఎంకే కూటమి అభ్యర్థులు 52 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాను పోటీ చేసిన పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాలు రెండింటిలోనూ విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చెన్నైలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

సొంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుచేస్తాం..టీవీకే

ఈ ఫలితాలతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు భారీ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు గాలి స్పష్టంగా వీస్తోందని పార్టీ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరార్డ్ విలేకరులకు స్పష్టం చేశారు. తమ పార్టీకి ప్రజలు విశేష మద్దతు ఇస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తమకు వస్తున్నందున ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. మార్పు కోరుకునే ఓటర్లంతా తమ నాయకుడు విజయ్ వైపు గట్టిగా నిలబడ్డారని వారు వివరిస్తున్నారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువచ్చే పాలన అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

తమ నాయకుడు విజయ్ పై ఉన్న గట్టి నమ్మకంతో ఐరోపా తదితర విదేశాల నుంచి కూడా అభిమానులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టుకుని మరీ ఓటు వేసేందుకు వచ్చారు. వారు ఆశించినట్లుగానే దళపతి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సామాన్య ప్రజల నుంచి వస్తున్న ఈ అపూర్వ మద్దతు అందరినీ ఆశ్చర్యపరుస్తోందని అన్నారు.

Follow Us