Kerala CM: కేరళ సీఎం ఎవరు..? రేసులో ఆ ముగ్గురు.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఏమన్నారంటే..
యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో కేరళ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ప్రతిపక్ష నేత సతీశన్‌తో పాటు కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల, సురేశ్ సీఎం రేసులో ఉన్నారు. శశిథరూర్ ఈ విషయంపై స్పందిస్తూ, పార్టీ మార్పును కోరుకుంటోందని, సీఎం నిర్ణయం హైకమాండ్‌దేనని స్పష్టం చేశారు.

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో UDF కూటమి ఘన విజయం సాధించడంతో సీఎం ఎవరన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. తాజా ఎన్నికల సంఘం ట్రెండ్స్ ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ మార్కును దాటింది. అయితే.. సీఎం ఎవరవుతారన్న దానిపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. ప్రస్తుత అసెంబ్లీలో విపక్ష నేత సతీషన్ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. అయితే సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల, సురేశ్ కూడా పోటీ పడుతున్నారు. తనకు సీఎం పదవి కావాలని ఎన్నికల ఫలితాలకు ముందు కేసీ వేణుగోపాల్ లేఖ రాసినట్టు చెబుతున్నారు.
గత ఐదేళ్ల నుంచి అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న సతీషన్‌కు ఎక్కువ అవకాశాలున్నాయి. లెఫ్ట్ సర్కార్‌పై రాజీలేని పోరాటం చేసిన నేతగా సతీషన్‌కు గుర్తింపు ఉంది. మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా సతీషన్‌కే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
కేసీ వేణుగోపాల్‌తో పాటు రమేశ్ చెన్నితలకు హైకమాండ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శశిథరూర్, ఎంపీ సురేశ్‌ల పేర్లు కూడా ప్రస్తావన వచ్చినప్పటికి వాళ్లకు తక్కువ అవకాశాలు ఉన్నాయి.
సతీషన్ ఐదుసార్లు పరవూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మిత్రపక్షాల మద్దతు కూడా సతీషన్‌కే ఉంది.. దీంతో కేరళం సీఎం ఎవరన్నది ఉత్కంఠగా మారింది.
కేరళం ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై శశిథరూర్ ఏమన్నారంటే..
యూడీఎఫ్ విజయం నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము మార్పును కోరుకునే పార్టీ. పదేళ్లుగా ఈ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ తీరును మేము మార్చాలనుకుంటున్నాము, అది ఎంతగా మారాలంటే, నా అభిప్రాయంలో, ఒక కొత్త తరహా రాజకీయాలు చాలా అవసరం.” అని అన్నారు. ముఖ్యమంత్రి ఫేస్ గురించి మాట్లాడుతూ “మేము ప్రస్తుతం ఈ విషయంపై చర్చించదలుచుకోలేదు. ఎన్నికల ఫలితాలు రానివ్వండి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే , గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడటానికి ఒకరిని పంపుతారు. ఆ తర్వాత, వారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అప్పుడు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది.” అని అన్నారు.
#WATCH | Thiruvananthapuram, Keralam: Congress-led UDF has crossed the majority mark, according to the latest Election Commission trends.
Congress MP Shashi Tharoor says, “We are a party of change. We want to change the way this government has played politics for ten years, so… pic.twitter.com/3n098UE8Ph
— ANI (@ANI) May 4, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
