AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్.. అసలు లెక్కలు ఇవి.. అఫీసియల్ డేటా

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న వేళ అధికారిక ట్రెండ్స్‌లో ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. అస్సాంలో బీజేపీ ముందంజలో ఉండగా, కేరళలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ లీడ్‌లో ఉండగా, పుదుచ్చేరిలో ఏఐఎన్ఆర్సీ ముందంజలో ఉంది. తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్.. అసలు లెక్కలు ఇవి.. అఫీసియల్ డేటా
Assembly Trends
Ram Naramaneni
|

Updated on: May 04, 2026 | 10:26 AM

Share

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైన తాజా ట్రెండ్స్ ప్రకారం పలు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు ఉన్న ఎలక్షన్ కమిషన్ అధికారిక సైట్‌లో అప్ డేట్ అయిన డేటా ప్రకారం….

అస్సాంలో మొత్తం 126 స్థానాలకు గాను ప్రస్తుతం ట్రెండ్స్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. బీజేపీ 57 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 16 స్థానాల్లో కొనసాగుతోంది. ఇతర ప్రాంతీయ పార్టీలూ కొంతమేర ప్రభావం చూపుతున్నాయి.

కేరళలో పోటీ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో ముందంజలో ఉండగా, సీపీఎం 29 స్థానాల్లో ఉంది. ఐయూఎంఎల్, సీపీఐ వంటి పార్టీలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.

పుదుచ్చేరిలో ఏఐఎన్ఆర్సీ ముందంజలో ఉంది. ఆ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇతర పార్టీలు పరిమిత స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

తమిళనాడులో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. టీవీకే 50 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఎడీఎంకే 47 స్థానాల్లో ఉంది. డీఎంకే 23 స్థానాల్లో కొనసాగుతోంది. ఇది త్రిముఖ పోటీని సూచిస్తోంది.

పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి. బీజేపీ 32 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీఎంసీ 9 స్థానాల్లో మాత్రమే ఉంది.

ఇప్పటివరకు వచ్చిన ఇవి కేవలం ట్రెండ్స్ మాత్రమే. పూర్తి ఫలితాల కోసం కౌంటింగ్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. తుది ఫలితాలు రాజకీయ దృశ్యాన్ని ఎలా మలుపుతిప్పుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఎగ్జిట్ పోల్స్‌లో ఎవరెవరు ఎలా ఇచ్చారో మీరు దిగువన చూడొచ్చు…

Follow Us