AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అయ్యో! దీన స్థితిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్.. టీబీతో బాధపడుతూ.. రోడ్డుపై టిఫిన్ సెంటర్ నడుపుతూ..

సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం లాంటిది. ఇక్కడ సక్సెస్ నే ప్రామాణికంగా తీసుకుంటారు. రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే చాలు స్టార్ హీరోనైనా లైట్ తీసుకుంటారు. అసలు పట్టించుకోరు. అలా గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల తార ఇప్పుడు దీన స్థితిలో ఉంది.

Tollywood: అయ్యో! దీన స్థితిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్.. టీబీతో బాధపడుతూ.. రోడ్డుపై టిఫిన్ సెంటర్ నడుపుతూ..
Bollywood Actress
Basha Shek
|

Updated on: May 04, 2026 | 11:05 AM

Share

గతంలో స్టార్స్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో చాలా మంది ఇప్పుడు వ్యాపార వేత్తలుగా రాణిస్తున్నారు. మరికొందరు సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ సహాయక నటి/ నటుడి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అయితే గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల తార ఇప్పుడు దీన స్థితిలో బతుకీడుస్తోంది. భర్త, కుటుంబ సభ్యులకు దూరమై అనాథలా జీవిస్తోంది. పొట్ట కూటి కోసం టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. ఆమె దీన పరిస్థితిని చూసిన నెటిజన్లు ‘ అయ్యో! ఈ అందాల తారకు ఏమైంది’ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఆమెను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? పూజ దద్వాల్.. తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ హిందీ సినిమాలు, సీరియల్స్ చూసే వారికి ఈ నటి బాగా పరిచయమే. ఎందుకంటే ఈ అందాల తార గతంలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే కొన్ని టీవీ ప్రోగ్రామ్స్, సీరియల్స్ లోనూ చేసింది. అయితే ఈ బ్యూటీకి పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. చేసిన సినిమాలన్నీ పరాజయం పాలు కావడంతో పెళ్లి చేసుకుని భర్తతో కలిసి గోవాలో సెటిలైంది.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. టీబీ మహమ్మారి ఈ ముద్దుగుమ్మ జీవితాన్ని అతలా కుతలం చేసింది. దీంతో కట్టుకున్న భర్త, అత్తమామ ఈమెను ముంబై తీసుకొని వచ్చి వదిలేశారు. చివరికి కన్నవాళ్లు, స్నేహితులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అనాథలా రోడ్డు పడిపోయింది పూజ. దీంతో ఏం చేయాలో తోచక తనకు సాయం చేయమని ఓ వీడియో చేయగా స్టార్ హీరో సల్మాన్ వెంటనే స్పందించాడు. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయి చికిత్స, ఆహారం, దుస్తులు.. ఇలా అవసరమైన ప్రతీది ఆమెకు అందేలా చేశాడు. సల్మాన్ సాయంతో చనిపోతుందనుకున్న పూజా మళ్లీ కోలుకుంది. సాధారణ స్థితికి వచ్చింది. ముంబైలో చిన్న ఇల్లు తీసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. పొట్టకూటి కోసం చాలా పనులు చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు రోడ్డుపై ఓ టిఫన్ సెంటర్ నడుపుతోంది. అందులో వచ్చిన డబ్బులతోనే పొట్ట నింపుకొంటోంది.

ఇవి కూడా చదవండి
Pooja Dadwal

Pooja Dadwal

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..