Assembly Election Results: అధికారానికి మ్యాజిక్ ఫిగర్ ఎంత? ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు?
తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తమిళనాట ఎర్లీ ట్రెండ్స్‌లో విజయ్ ప్రభంజనం కనిపిస్తుంది. అటు బెంగాల్‌లో హోరాహోరీలా పోరులా ఉంది ప్రజంట్ సిట్యువేషన్.. అస్సాంలో బీజేపీవైపే పవనాలు వీస్తున్నాయి ..

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారన్న ఉత్కంఠ నెలకొన్న వేళ.. ఆయా రాష్ట్రాల్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు, మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం …
తమిళనాడు:
మొత్తం అసెంబ్లీ స్థానాలు: 234
అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్: 118
పశ్చిమ బెంగాల్:
మొత్తం అసెంబ్లీ స్థానాలు: 294
మ్యాజిక్ ఫిగర్: 148
(ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా ప్రస్తుతం 293 స్థానాలకే కౌంటింగ్ జరుగుతోంది)
అస్సాం:
మొత్తం అసెంబ్లీ స్థానాలు: 126
మ్యాజిక్ ఫిగర్: 64
కేరళ:
మొత్తం అసెంబ్లీ స్థానాలు: 140
మ్యాజిక్ ఫిగర్: 71
పుదుచ్చేరి:
మొత్తం అసెంబ్లీ స్థానాలు: 30
మ్యాజిక్ ఫిగర్: 16
ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుండగా.. ఎవరు మెజారిటీ దాటుతారు? ఎక్కడ హంగ్ పరిస్థితులు ఏర్పడతాయి? అన్నది మరికాసేపట్లో స్పష్టత రానుంది.
