Shukra Gochar: స్వక్షేత్రంలో శుక్ర గ్రహం.. ఆ రాశుల వారి కలలన్నీ సాకారం కాబోతున్నాయ్..!
Venus Transit: జూన్ 26 నుండి జూలై 26 వరకు శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. వృషభ, సింహ, వృశ్చిక, కుంభ రాశులకు మాలవ్య మహాపురుష యోగం, మేష, కర్కాటక రాశులకు లక్ష్మీ యోగం కలుగుతుంది. ఈ కాలంలో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ ప్రగతి, దాంపత్య సుఖం, ఆరోగ్యం మెరుగుపడతాయి. ప్రతి రాశివారికి వివరణాత్మక ఫలితాలు ఈ వ్యాసంలో ఉన్నాయి.

Shukra Gochar
Lucky Zodiac Signs: ఈ నెల 26 నుంచి జూలై 26 వరకు నెల రోజుల పాటు శుక్ర గ్రహం తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో సంచారం చేయబోతోంది. దీనివల్ల వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు మాలవ్య మహా పురుష యోగం కలుగుతుంది. మేష, కర్కాటక రాశులకు లక్ష్మీ యోగం పడుతుంది. మామూలుగానే శుభ ఫలితాలనిచ్చే ఈ సహజ శుభ గ్రహం తన సొంత రాశిలో ఉన్నప్పుడు మహా యోగాలను కలగజేయడం జరుగుతుంది. ప్రేమలు, పెళ్లిళ్లు, విలాసాలు, సుఖ సంతోషాలు, శారీరక సుఖాలకు కారకుడైన శుక్రుడు తన సొంత రాశిలో ఉన్నప్పుడు తప్పకుండా రాజయోగాలు కలిగిస్తాడు.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడు ప్రవేశించడం వల్ల సంపన్న కుటుంబంతో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు, శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో జీతాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఎటువంటి అనారోగ్యమైనా నయమయ్యే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల ఏ రంగంలో ఉన్నా ఊహించని పురోగతి కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు కలుగుతాయి.
- సింహం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల మాలవ మహా పురుష యోగం కలిగింది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో పాటు, ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా ధన లాభాలు కలుగుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి తప్ప కుండా జరుగుతాయి. ఎటువంటి వైవాహిక సమస్యలైనా తొలగిపోయి, దంపతుల మధ్య అన్యో న్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. జీవన శైలి మారిపోతుంది.
- కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు ప్రవేశిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. పలుకుబడి బాగా విస్తరిస్తుంది. ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆస్తిపాస్తుల సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబంలోనూ, దాంపత్యంలోనూ సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంతో విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు.



