Money Astrology: మేష రాశిలోకి శుక్రుడు.. ఆ రాశులకు కలలో కూడా ఊహించని ధన యోగాలు
Shukra Gochara Phalalu 2025: శుక్రుని మేష రాశి సంచారం (మార్చి 31 నుండి జూన్ 28 వరకు) నాలుగు చర రాశులు, రెండు ద్విస్వభావ రాశులు (మిథునం, ధనస్సు)పై అనుకూల ప్రభావం చూపుతుంది. ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక లాభాలు, కుటుంబ సంతోషం, మనో కోరికలు నెరవేరే అవకాశం ఉంది. కొన్ని రాశులకు కలలో కూడా ఊహించని ధన యోగాలు పట్టనున్నాయి.

Money Astrology 2025
Venus Transit 2025: ఈ నెల 31 నుంచి జూన్ 28 వరకూ మేష రాశిలో సంచారం చేయబోతున్న శుక్ర గ్రహం వల్ల నాలుగు చర రాశులకు, రెండు ద్విస్వభావ రాశులకు దశ తిరగబోతోంది. వీరికి జీవితంలో సుఖ సంతోషాలు పెరగడం, మనశ్శాంతి కలగడంతో పాటు మనసులోని కోరికలు, ఆశల్లో ముఖ్యమైనవి నెరవేరే అవకాశం ఉంది. చర రాశులైన మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు రాజయోగాలు కలగడం, ద్విస్వభావ రాశులైన మిథున, ధనూ రాశులకు కలలో కూడా ఊహించని ధన యోగాలు కలుగుతాయి.
- మేషం: ఈ రాశిలో ఈ నెల 31న శుక్రుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరగడం ప్రారంభమవుతుంది. ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. పని ఒత్తిడి నుంచి, అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వీరి సలహాలు, సూచనల వల్ల అధికా రులు అత్యధికంగా లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంసార సంబంధమైన సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆదాయం పెరగడమే కానీ, తగ్గడం ఉండదు. ఆర్థికాభివృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. కుటుంబ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
- తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ప్రవేశించినందువల్ల విదేశీయాన యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. అనుకో కుండా ఆస్తి వివాదం పరిష్కారమై భూ లాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి అత్యంత శుభ స్థానమైన పంచమ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడంవల్ల అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. శుక్రుడు ఈ రాశిలో సంచారం చేస్తున్న కాలంలో ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీల వంటివి బాగా లాభిస్తాయి. అనుకోకుండా ఆస్తి లాభం కలుగుతుంది. పిత్రార్జితం లభించే అవకాశం కూడా ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగ సూచనలున్నాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
- మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం కలుగుతుంది. దీని వల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. మరింత మంచి సంస్థలోకి మారే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.



