AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: రాశ్యధిపతి అనుకూలత.. ఆ రాశుల వారి జీవితం సాఫీగా.. హ్యాపీగా..!

Telugu Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం లగ్నాధిపతి లేదా రాశ్యధిపతి గ్రహాల స్థానాలు ఒకరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి బలం, స్థానం ఆధారంగా జీవితం సుఖంగా లేదా దుఃఖంగా సాగుతుంది. ప్రస్తుతం కొన్ని రాశుల వారికి రాశ్యాధిపతి చాలా అనుకూలంగా ఉన్నారు. దీంతో వారి జీవితం సాఫీగా.. హ్యాపీగా సాగిపోయే అవకాశముంది.

Astrology: రాశ్యధిపతి అనుకూలత.. ఆ రాశుల వారి జీవితం సాఫీగా.. హ్యాపీగా..!
Lagna Lord Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: May 28, 2025 | 7:22 PM

Share

జ్యోతిష శాస్త్రం ప్రకారం, జాతక చక్రంలో లగ్నాధిపతి లేదా రాశ్యధిఫతి ఎక్కడ ఉన్నాడన్న దాని మీదే వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి లేదా రాశ్యధిపతి ఎంత బలంగా ఉంటే అంత మంచిది. చిన్న యోగమైనా తిరుగులేని ఫలితాలనిస్తుంది. ఈ అధిపతి సరిగా లేని పక్షంలో జాతక చక్రంలో ఎటువంటి మహా యోగమున్నా ఫలించదు. లగ్నాధిపతి లేదా రాశ్యధిపతి బలంగా, సరైన స్థానంలో ఉన్న పక్షంలో జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఇతర గ్రహాలన్నిటి కంటే లగ్నాధిపతి, రాశ్యధిపతి స్థితిగతులు చాలా ముఖ్యం. ప్రస్తుతం గ్రహ సంచారంలో రాశ్యధిపతి స్థితి మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశులవారికి బాగా అనుకూలంగా ఉంది.

  1. మేషం: ఈ రాశి అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం కర్కాటకంలో, ఆ తర్వాత జూన్ 7 నుంచి సింహ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి మరో మూడు నెలల పాటు రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులను అందుకుంటారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంతాన యోగం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలకు దశ తిరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం మీన రాశిలో, ఆ తర్వాత మేష రాశిలో సంచారం చేయడం వల్ల మరో నెల రోజుల పాటు ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు విజయాలు సాధిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  3. సింహం: ఈ రాశి నాథుడైన రవి గ్రహం దశమ, లాభ స్థానాల్లో సంచారం చేయడం వల్ల మరో రెండు నెలల పాటు జీవితం వైభవంగా, రాజసంగా సాగిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు అందుతాయి. విదేశీ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు, చదువులకు అవకాశాలు అంది వస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
  4. కన్య: ఈ రాశికి అధిపతి అయిన బుధ గ్రహం భాగ్య స్థానంలో, రవితో కలిసి ఉన్నందువల్ల మరో నెల రోజుల పాటు ఈ రాశివారికి ప్రతిదీ అనుకూలంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. తప్పకుండా ఆదాయ వృద్ధి, వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ వంటివి చోటు చేసుకోవడం జరుగుతుంది. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశినాథుడైన గురు గ్రహం సప్తమ స్థానంలో సంచారం ప్రారంభించినందువల్ల ఈ రాశివారికి ఏడాది పాటు జీవితం వైభవంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది.
  6. మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలో చేస్తున్నందువల్ల రెండున్నరేళ్ల పాటు ఈ రాశివారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.