Shubh Yogas: దుస్థానాల్లో కీలక గ్రహాల సంచారం.. అయినా ఆ రాశుల వారికి శుభ యోగాలు పట్టబోతున్నాయ్..!
శుభ గ్రహాలు 3,6,8,10,12 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు సాదారణంగా శుభ ఫలితాలివ్వవని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అయితే, బుధ, శుక్ర, గురు గ్రహాలు మూడూ వృషభ రాశిలో కలిసి ఉండడం వల్ల ఈ రాశులకు కూడా కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మూడు శుభ గ్రహాలు రవితో కలిసి ఉండడం ఒక విశేషం కాగా..
శుభ గ్రహాలు 3,6,8,10,12 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు సాదారణంగా శుభ ఫలితాలివ్వవని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అయితే, బుధ, శుక్ర, గురు గ్రహాలు మూడూ వృషభ రాశిలో కలిసి ఉండడం వల్ల ఈ రాశులకు కూడా కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మూడు శుభ గ్రహాలు రవితో కలిసి ఉండడం ఒక విశేషం కాగా, వృషభం వంటి స్థిర రాశిలో కలవడం మరొక విశేషం. ఈ వృషభ రాశిలో మూడు వారాల పాటు సంచారం చేయబోతున్న గురు, బుధ, శుక్ర, రవుల వల్ల మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశులకు కూడా మంచి శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఈ నాలుగు గ్రహాల యుతి చోటు చేసుకుంది. రాశ్యధిపతి బుధుడితో మరో రెండు శుభ గ్రహాలు చేరినందువల్ల ఈ రాశివారికి రాజయోగం పడుతుంది. రెండు మూడు రోజుల పాటు జీవితం దర్జాగా సాగిపోతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గిపోతాయి. తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. మనసులోని కోరికలను నెరవేర్చుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది.
- సింహం: జ్యోతిషశాస్త్రం ప్రకారం దశమ స్థానంలో శుభ గ్రహాలు సంచారం చేయడం మంచిది కాదు. అయితే, ఇక్కడ ప్రస్తుతం రాశ్యధిపతి రవి కూడా కలిసి ఉన్నందువల్ల, రాజయోగం పడుతుంది. సమా జంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరు గు తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.
- తుల: ఈ రాశికి అష్టమ స్థానంలో నాలుగు గ్రహాల యుతి వల్ల, తల్లి లేదా భార్య తరఫు నుంచి ఆకస్మిక ధన లాభం గానీ, సంపద కలిసి రావడం గానీ జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా లాభాలనిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి వృద్ధి చెందు తుంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభించి, హోదా, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి ఆరవ స్థానంలో శుభ గ్రహాలు కలవడం వల్ల ఆ స్థానం లక్షణాలు మారిపోతాయి. ఫలి తంగా ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఆదాయం కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చక్కబడుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేయడం జరుగుతుంది. సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- మీనం: ఈ రాశికి మూడవ స్థానంలో శుభ గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభాలు సంపాదించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. విదేశీయాన యోగం కూడా పట్టే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలని స్తాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది.