Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (May 15, 2025): ప్రతి రాశికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, ప్రేమ వ్యవహారాలు, ఆరోగ్యం సంబంధించి దినఫలాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశముంది. వృషభ రాశ వారి ఆదాయ ప్రయత్నాలన్నీ చాలావరకు సఫలమవుతాయి. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి సంబంధించి సమయం బాగా అనుకూలంగా ఉంది. మేషం నుండి మీనం వరకు అన్ని రాశులకు సానుకూల, ప్రతికూల అంశాలను వివరించబడ్డాయి.

Horoscope Today: ఆ రాశుల వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 15 May 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 15, 2025 | 5:01 AM

దిన ఫలాలు (మే 15, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశముంది. వృషభ రాశ వారి ఆదాయ ప్రయత్నాలన్నీ చాలావరకు సఫలమయ్యే అవకాశముండగా.. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి సంబంధించి సమయం బాగా అనుకూలంగా ఉంది. మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం వృద్ది చెందుతాయి. సరికొత్త పరిచయాలు కలుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపా రంలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఒత్తిడి, శ్రమ ఉన్నా, సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ చాలావరకు సఫలమవుతాయి. నిరుద్యోగులు తమకు అందిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయ వృద్ధికి సంబంధించి సమయం బాగా అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్లు, షేర్లు బాగా లాభించడంతో పాటు, రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకుదూసుకుపోతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లే‌ష)

ఉద్యోగంలో ఇతరుల బాధ్యతల్ని పంచుకోవడం జరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవ సరం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఇంటా బయటా బాగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధను పెంచడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయంతో పోటీగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థికపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు. వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. బంధు మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో మరింతగా సాన్నిహిత్యం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. పెండింగ్ పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రస్తుతానికి ఆర్థికంగా ఇతరులకు ఎవరికైనా వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఆస్తి వివాదం విషయంలో సోదరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయానికి లోటుండదు. కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం చేతికి అందుతుంది. ఆకస్మిక ధన వృద్ధికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిగా నిదానంగా ముగిసే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. ఆస్తి వివాదానికి సంబంధించి సానుకూల సమాచారం వింటారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది