Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆర్థికంగా వారికి ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

ఏప్రిల్ 30, 2025 నాటి 12 రాశులకు సంబంధించిన దినఫలాలు ఇక్కడ అందించడం జరిగింది. మేష రాశి వారు శుభవార్తలు అంటుకుంటారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి వారు అనవసర ఖర్చులను నియంత్రించాలి. నిరుద్యోగులకు విదేశాల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రతి రాశి వారికి దినఫలాలు వేరువేరుగా ఉంటాయి. ఈ రోజు మీ రాశి ఫలితాలను తెలుసుకోండి.

Horoscope Today: ఆర్థికంగా వారికి ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 30 April 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 30, 2025 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 30, 2025): మేష రాశి వారు ఒకటి రెండు శుభ వార్తలు వింటారు.ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా పురోగతి చెందుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. రోజంతా ఎంతో మెరుగ్గా, సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా పురోగతి చెందుతుంది. శత్రు, రోగ, రుణ బాధలు కొద్దిగా తగ్గి ఉంటాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు యథా ప్రకారం లాభదాయకంగా కొనసాగుతాయి. ఆదాయం పెరగడమే కాక, ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కొద్ది ప్రయత్నంతో, కొద్ది శ్రమతో ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే, ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. రాదనుకున్న కూడా డబ్బు చేతికి అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు కానీ కుటుంబ ఖర్చులు మాత్రం పెరిగే సూచనలున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అనుకోని ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో దూరపు బంధువుల నుంచి శుభ వార్త అందుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యంగా ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. తల్లితండ్రులతో సాన్నిహిత్యం, సామరస్యం పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా విసిగించే అవకాశం ఉంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. మీ సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రోజంతా సంతృప్తికరంగా, అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కొద్దిగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఏ మాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడి, విశ్రాంతి తగ్గుతుంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మాట చెల్లుబాటు అవుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కొద్దిగా అపార్థాలు తలెత్తవచ్చు. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు.

ఈ ఆహారాల డైట్‎లో యాడ్ చెయ్యండి.. గుండె ఆరోగ్యం పదిలం..
ఈ ఆహారాల డైట్‎లో యాడ్ చెయ్యండి.. గుండె ఆరోగ్యం పదిలం..
శేఖర్ కమ్ముల 'కుబేర'లో ఆ టాలీవుడ్ స్టార్ హీరో నటించాల్సిందా?
శేఖర్ కమ్ముల 'కుబేర'లో ఆ టాలీవుడ్ స్టార్ హీరో నటించాల్సిందా?
ఒక్క ఫోన్ కాల్.. ప్రధాని పీఠానికే ఎసరు పెట్టింది!
ఒక్క ఫోన్ కాల్.. ప్రధాని పీఠానికే ఎసరు పెట్టింది!
రెండుసార్లు అబార్షన్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ యాంకర్
రెండుసార్లు అబార్షన్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ యాంకర్
పెన్షన్ అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్‌..డిజిటల్‌ ఆడిట్‌ దిశగా అడుగులు
పెన్షన్ అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్‌..డిజిటల్‌ ఆడిట్‌ దిశగా అడుగులు
కారులో స్పీకర్లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
కారులో స్పీకర్లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
క్రికెట్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో తోపు..
క్రికెట్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో తోపు..
మీ డైట్‎లో ఈ ఫుడ్స్ చాలు.. మీ కాలేయనికి కొండంత అండ..
మీ డైట్‎లో ఈ ఫుడ్స్ చాలు.. మీ కాలేయనికి కొండంత అండ..
సగం చిరిగిన రూ.10 నోటు వెనుక అసలు 'రహస్యం' ఇదే!
సగం చిరిగిన రూ.10 నోటు వెనుక అసలు 'రహస్యం' ఇదే!
కన్నీళ్లు కనిపించకుండా కారవాన్‌లో ఏడ్చేసి బయటకు వచ్చేదాన్ని..
కన్నీళ్లు కనిపించకుండా కారవాన్‌లో ఏడ్చేసి బయటకు వచ్చేదాన్ని..
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది