AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodia Signs: గురువుపై రవి వీక్షణ.. అదృష్టం వీరి తలుపు తట్టడం ఖాయం!

Telugu Astrology: నవంబర్ 16 నుంచి రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. ఇదే సమయంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు రవిని వీక్షించడం వల్ల 6 రాశుల వారికి అరుదైన ఆదాయ, అధికార యోగాలు పడతాయి. వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి ఉద్యోగ పదోన్నతులు, ఆర్థిక ప్రగతి, వ్యాపార వృద్ధి, విదేశీ అవకాశాలు లభించి రాజయోగం కలుగుతుంది. ఇది శీఘ్ర పురోగతికి మార్గం సుగమం చేస్తుంది.

Lucky Zodia Signs: గురువుపై రవి వీక్షణ.. అదృష్టం వీరి తలుపు తట్టడం ఖాయం!
Lucky Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 11, 2025 | 7:03 PM

Share

ఈ నెల (నవంబర్) 16వ తేదీ నుంచి రవి తనకు ఉచ్ఛ రాశితో సమానమైన వృశ్చిక రాశిలో నెల రోజుల పాటు సంచారం చేయడం జరుగుతోంది. రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న సమయంలో కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వీక్షించడం జరుగుతుంది. రవిని గురువు వీక్షించడం వల్ల ఆరు రాశుల వారికి అరుదైన ఆదాయ, అధికార యోగాలు పట్టడం జరుగుతుంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రవిని గురువు చూసినప్పుడు అధికార యోగానికి, శీఘ్ర పురోగతికి అవకాశముంటుంది. ప్రస్తుతం దీనివల్ల లబ్ది పొందబోయే రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీనం.

  1. వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో ప్రవేశించిన రవిని గురువు ఉచ్ఛ స్థితి నుంచి వీక్షించడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా చక్కని అధికార యోగం పడుతుంది. వీరు ఎటువంటి కార్యాన్నయినా సాదించగలుగుతారు. ఏ పనినైనా పట్టుదలగా పూర్తి చేస్తారు. నెల రోజుల పాటు జీవితం రాజసంగా సాగి పోతుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఆర్థికంగా బాగా పురోగతి చెందుతారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా చక్కబడతాయి.
  2. కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు పంచమ స్థానంలో ఉన్న రవిని వీక్షించడం వల్ల ఈ రాశి వారికి విపరీత రాజయోగం కలుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది.
  3. కన్య: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న రవిని లాభ స్థానం నుంచి ఉచ్ఛ గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగం పట్టడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం, విదేశీ అవకాశాలు లభించడం వంటివి తప్ప కుండా జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. అనేక మార్గాల్లో సంపద వృద్ది చెందే అవకాశముంది.
  4. తుల: ఈ రాశికి ధన స్థానంలో ప్రవేశించిన రవిని దశమ స్థానం నుంచి ఉచ్ఛ గురు వీక్షించడం వల్ల ఉద్యో గులు, నిరుద్యోగులకు తప్పకుండా విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. ఉద్యో గుల నైపుణ్యాలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. దుర్వసనాల నుంచి బయటపడతారు. తల్లితండ్రుల ద్వారా ఆస్తి, సంపద కలిసి వస్తాయి.
  5. మకరం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న రవిని సప్తమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల సంపన్న కుటుంబంతో వివాహం నిశ్చయం కావడం, సంపన్న వ్యక్తితో లేదా పలుకుబడి కలిగిన వ్యక్తితో ప్రేమలో పడడం వంటివి తప్పకుండా జరుగుతాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. సీనియర్లను కాదని అధికారులు ఈ రాశివారికి పదోన్నతి కల్పించడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విపరీతంగా లాభిస్తాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది.
  6. మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న రవిని ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు, ప్రాధాన్యం లభిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. ఉద్యోగుల శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
ముద్దుగున్న పొద్దుతిరుగుడుతో పుష్కలమైన ఆరోగ్యం.. విత్తనాలే కాదు..
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
మళ్లీ విజృంభిస్తున్న కోహ్లీ ఫాంకు సీక్రెట్ అదేనట
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
నిజంగా జీలకర్ర నీరు తాగితే పొట్ట తగ్గుతుందా.. అపోహలు కాదు..
ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఇంత దారుణమా..?
ఇంటి అద్దె ఎగ్గొట్టడానికి ఇంత దారుణమా..?
మళ్లీ అదే జోరు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
మళ్లీ అదే జోరు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు