AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Horoscope: రవి నీచత్వం.. ఆ రాశుల వారికి కొన్ని రకాల అదృష్టాలు పక్కా..!

ఈ నెల 17వ తేదీ నుంచి నవంబర్ 16 వరకు రవి గ్రహం తులా రాశిలో సంచారం చేస్తుంది. రవికి తులా రాశిలో నీచబడతాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి ఒక పాప గ్రహం. ఈ పాప గ్రహం నీచ బడడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి రవి నీచత్వం వల్ల కొన్ని రకాల అదృష్టాలు పడతాయి.

Lucky Horoscope: రవి నీచత్వం.. ఆ రాశుల వారికి కొన్ని రకాల అదృష్టాలు పక్కా..!
Lucky Astrology 2024
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 12, 2024 | 3:14 PM

Share

ఈ నెల 17వ తేదీ నుంచి నవంబర్ 16 వరకు రవి గ్రహం తులా రాశిలో సంచారం చేస్తుంది. రవికి తులా రాశిలో నీచబడతాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి ఒక పాప గ్రహం. ఈ పాప గ్రహం నీచ బడడం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి రవి నీచత్వం వల్ల కొన్ని రకాల అదృష్టాలు పడతాయి. మిగిలిన రాశుల వారు ఒక నెల రోజుల పాటు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల కష్టనష్టాలు దరి చేరే అవకాశం ఉండదు.

  1. వృషభం: ఈ రాశికి షష్ట స్థానంలో రవి సంచారం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు సంబం ధించిన అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. బంధువులతో వివాదాలు సమసిపోవడమే కాకుండా సామరస్యం బాగా పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్న మైనా సునాయాసంగా నెరవేరుతుంది. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు సఫలమవుతాయి.
  2. మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగాల్లో మీ సమర్థతను అనేక విధాలుగా నిరూపించుకుంటారు. ఇంటా బయటా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనవసర పరిచయాల నుంచి, వ్యసనాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఏ విషయంలోనైనా ప్రయత్న లోపం లేకుండా చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది.
  3. సింహం: రాశ్యధిపతి రవి తృతీయ స్థానంలో నీచబడడం వల్ల ప్రయత్నాలను ముమ్మరం చేయవలసి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తోబుట్టువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్య లున్నా తొలగిపోయి, సుఖ సంతోషాలతో గడపడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  4. తుల: ఈ రాశిలో రవి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. అన్ని విధాలుగానూ మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో క్లెయింట్లు, కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంటారు. ఆర్థిక వ్యవహారాలను పూర్తి స్థాయిలో చక్కబెడ తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి 11వ స్థానంలో రవి సంచారం వల్ల విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ వర్గాల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది.
  6. మకరం: ఈ రాశికి దశమ స్థానంలో రవి నీచబడడం వల్ల ఉద్యోగపరంగా ఉచ్ఛ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పదోన్నతికి అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను రాబట్టుకుంటారు. నిరుద్యోగులకు అనేక అవకాశాలు అంది వస్తాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి సమయం అనుకూలంగా మారుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది.