Money Astrology: మేష రాశిలోని గురువుకు మరో రెండు శుభ గ్రహాలపై పూర్ణ దృష్టి.. ఆ రాశుల వారికి తిరుగులేని ఆర్థిక యోగం..!
ప్రస్తుతం మేష రాశిలో సంచారం చేస్తున్న గురువు మరో రెండు శుభ గ్రహాలైన బుధ, శుక్రుల మీద పూర్ణ దృష్టి పెట్టడం చాలా శుభప్రదమైన పరిణామం. దీనివల్ల ఆరు రాశుల వారికి ఒక తిరుగులేని ఆర్థిక యోగం ఏర్పడుతోంది. దీనిని జ్యోతిష శాస్త్రంలో సువర్ణ యోగం అంటారు. ధనూ రాశిలో ఉన్న బుధుడి మీదా, తులా రాశిలో ఉన్న శుక్రుడి మీద గురువు దృష్టి పడడం వల్ల ఈ రాశులవారి జీవితాలు ఆర్థికంగా మంచి మలుపు తిరుగుతాయి.
ప్రస్తుతం మేష రాశిలో సంచారం చేస్తున్న గురువు మరో రెండు శుభ గ్రహాలైన బుధ, శుక్రుల మీద పూర్ణ దృష్టి పెట్టడం చాలా శుభప్రదమైన పరిణామం. దీనివల్ల ఆరు రాశుల వారికి ఒక తిరుగులేని ఆర్థిక యోగం ఏర్పడుతోంది. దీనిని జ్యోతిష శాస్త్రంలో సువర్ణ యోగం అంటారు. ధనూ రాశిలో ఉన్న బుధుడి మీదా, తులా రాశిలో ఉన్న శుక్రుడి మీద గురువు దృష్టి పడడం వల్ల ఈ రాశులవారి జీవితాలు ఆర్థికంగా మంచి మలుపు తిరుగుతాయి. అప్రయత్నంగా డబ్బు కలిసి వస్తూండడం ఈ యోగ లక్షణం. సంపద పెరగడం తప్ప తగ్గడమంటూ ఉండదు. చిన్న ప్రయత్నంతో భారీగా సొమ్ము సమకూరుతూ ఉంటుంది. ఇంట్లో డబ్బుతో పాటు బంగారం, విలువైన రత్నాలు, ఆధునిక సౌకర్యాలు పెంపొందుతాయి. ఈ యోగం ఫిబ్రవరి రెండవ వారం వరకూ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఈ శుభ గ్రహాల ఫలితాల ప్రభావం కొనసాగుతుంది. ఈ ‘పెట్టి పుట్టిన’ రాశులుః మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం.
- మేషం: ఈ రాశి నుంచి గురువు తులా రాశిలో ఉన్న శుక్రుడిని, ధనూ రాశిలో ఉన్న బుధుడిని వీక్షిం చడం వల్ల సువర్ణ యోగం అనే ఒక మంచి లక్ష్మీయోగం పడుతోంది. ఏదో రూపేణా ఇంట్లో సంపద పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గే అవకాశం ఉండదు. సతీమణితో కలిసి తరచూ విలువైన వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. ఒకటికి రెండు ఇళ్లు, వాహనాలు అమరే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి చాలావరకు బయటపడి, సుఖ సంతోషాలలో మునిగి తేలడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి గురువు లాభస్థానంలో ఉండి, పంచమంలో ఉన్న శుక్రుడిని, సప్తమంలో ఉన్న బుధు డిని వీక్షించడం వల్ల లక్ష్మీ కటాక్షం ఏర్పడుతోంది. ఫలితంగా ఇంట్లో వస్తు సంపద పెరుగుతుంది. అత్యధికంగా వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. మంచి ఉద్యోగం రావడం, మంచి ఉద్యోగంలోకి మారడం, జీత భత్యాలు, అదనపు రాబడి పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. సామాజిక స్థాయి మారుతుంది.
- సింహం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గురువు, వృద్ధి స్థానమైన తృతీయంలో శుక్రుడు, పంచమంలో బుధుడి సంచారం వల్ల మహా భాగ్య యోగమైన సువర్ణ యోగం ఏర్పడింది. ఈ యోగం ఫలితంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ రాశివారికి ఆదాయం లేదా సంపాదన పెరగడం తప్ప తరగడం అంటూ ఉండదు. భోగభాగ్యాలలో తులతూగుతారని చెప్పవచ్చు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. అనేక మార్గాలలో ఆదాయ వృద్ధి తప్పకుండా ఉంటుంది.
- తుల: ఈ రాశిలో రాశినాథుడైన శుక్రుడి సంచారం, వృద్ధి స్థానమైన తృతీయంలో బుధుడు, సప్తమ స్థానంలో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల సువర్ణ యోగానికి అవకాశం కలిగింది. ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. ఆదాయాలు, సంపాదనలు, లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవ కాశం ఉంది. యథేచ్ఛగా భోగ భాగ్యాలను అనుభవించడం జరుగుతుంది. భారీగా వస్త్రాభరణాలు, విలువైన రత్నాలు కొనడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది.
- ధనుస్సు: ఈ రాశిలో బుధుడు, పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు, లాభస్థానంలో శుక్రుడు సంచరించడ మనేది మహా యోగాన్ని కలిగించింది. దీని ఫలితంగా ఈ రాశివారికి లక్ష్మీనారాయణుల కటాక్షం పూర్తిగా కలిగింది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాకుండా ఆస్తిపరంగా, వడ్డీలపరంగా, ఆర్థిక లావా దేవీల పరంగా కూడా సంపద వృద్ధి చెందుతుంది. సంపద పెరగడంతో పాటు పిల్లలు వృద్ధిలోకి రావడం, ఆరోగ్యం కుదుటపడడం, ప్రతి ప్రయత్నమూ సఫలం కావడం వంటివి కూడా జరుగుతాయి.
- కుంభం: ఈ రాశివారికి వృద్ధి స్థానంలో ధన కారకుడైన గురువు, భాగ్య స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో బుధుడు ఉన్నందువల్ల ఆర్థిక ప్రయోజనాలు అత్యధిక శాతం నెరవేరే అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఆదాయం, రాబడి బాగా పెరుగుతాయి. అనేక పర్యాయాలు విలువైన వస్త్రాభరణాలు, విలువైన వస్తు సామగ్రి కొనడం జరుగుతుంది. ఇళ్లు, వాహనాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ధన ధాన్యాలకు లోటుండదు.