Salary Astrology: ఆ రాశుల వారికి భారీగా పెరగనున్న ధన సంపాదన.. మీ రాశికి ఎలా ఉంటుందంటే..?
జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వితీయ స్థానం ధన సంపాదన గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే కష్టార్జితం గురించి మాత్రమే తెలియజేస్తుంది. సమీప భవిష్యత్తులో జీత భత్యాలు ఏమైనా పెరగబోతున్నాయా? ఇందులో ఏమన్నా మిగులుతుందా? ఏమైనా పొదుపు చేసుకోగలుగుతామా? ఇటువంటి ప్రశ్నలకు గ్రహపరంగా సమాధానాలు చూడాల్సి ఉంటుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వితీయ స్థానం ధన సంపాదన గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే కష్టార్జితం గురించి మాత్రమే తెలియజేస్తుంది. సమీప భవిష్యత్తులో జీత భత్యాలు ఏమైనా పెరగబోతున్నాయా? ఇందులో ఏమన్నా మిగులుతుందా? ఏమైనా పొదుపు చేసుకోగలుగుతామా? ఇటువంటి ప్రశ్నలకు గ్రహపరంగా సమాధానాలు చూడాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం గ్రహాల సంచారం ప్రకారం ఏడు రాశుల వారికి సంపాదన నిలకడగా ఉండడమో, పెరగడమో జరుగుతోంది. ఇందులో సింహం, కన్య, తుల, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశులున్నాయి.
- సింహం: ఈ రాశికి ధన స్థానంలో కేతువు సంచారం వల్ల సంపాదనలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండవచ్చు. ఉద్యోగపరమైన జీతభత్యాలను కొద్దిగా దాచుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అనుకోని ఖర్చులు మీద పడడం, మధ్య మధ్య వైద్య ఖర్చులు పెరగడం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపాదనతో పాటు కుటుంబపరంగా కూడా కొద్దిగా సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఆర్థిక సమస్యలకు అంతగా అవకాశం ఉండకపోవచ్చు. తప్పకుండా జాగ్రత్త పెరుగుతుంది.
- కన్య: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో, అంటే ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడే సంచరిస్తున్నందువల్ల ఆర్థికంగా పెరుగుదలే ఉంటుంది తప్ప తరుగుదల ఉండే అవకాశం లేదు. విలాసాల మీదా, విలువైన వస్తువుల మీదా బాగా ఖర్చయ్యే సూచనలున్నప్పటికీ, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు కాకుండా అదనపు రాబడి కూడా ఉంటుంది. కుటుంబపరంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశివారికి ధన స్థానంలో ధనాధిపతి కుజ సంచారం వల్ల ఆదాయానికి లోటుండదు. ఆదాయం బాగా పెరిగే అవకాశమే ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాబడి కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వ్యాపారపరంగా కూడా ధనార్జన అధికమవుతుంది. అయితే, విలాసాల మీదా, కుటుంబ సభ్యుల మీదా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువ గానే ఉన్నప్పటికీ డబ్బు దాచుకోవడానికి అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశివారికి ధన స్థానంలో రవి, బుధులు ఉండడం వల్ల ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు, పొదుపు కూడా వృద్ధి చెందుతుంది. ఖర్చులు బాగా తగ్గే అవకాశం ఉంది. కుటుంబపరంగా కూడా ఆదాయం పెరుగుతుంది. ప్రయా ణాలను, యాత్రలను వాయిదా వేసుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు రాబడి పెరిగే సూచనలున్నాయి.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు ధన స్థానంలోనే ఉన్నందువల్ల, ఆదాయం పెరిగి, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనేక మార్గాలతో ఆదాయం వృద్ధి చెందే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో జీతభత్యాలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. పొదుపు పాటించడం, డిపాజిట్లలో పెట్టడం, ఖర్చులు తగ్గించుకోవడం వంటి చర్యల ద్వారా బ్యాంకు బ్యాలెన్సు పెరుగుతుంది.
- కుంభం: ఈ రాశివారికి ధన స్థానంలో రాహువు ఉన్నందువల్ల ఎంత కష్టపడ్డా ఫలితం బాగా తక్కువగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మధ్య మధ్య ఊహించని ఖర్చులు మీద పడుతుంటాయి. కుటుంబ అవసరాలు పెరుగుతాయి. అయితే, ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు. కానీ అదనపు రాబడి మాత్రం బాగానే పెరుగుతుంది.
- మీనం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి గురువే సంచరిస్తున్నందువల్ల, అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు లాభదాయకంగా కనిపిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక ప్రయోజనం పొందుతారు. అదనపు రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరిగి రుణ సమస్యలు తగ్గుతాయి. పొదుపు మార్గాలు అనుసరిస్తారు. ఖర్చులు బాగా తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు కానీ, శుభ కార్యాలు, దైవ కార్యాల మీద మాత్రం డబ్బు మంచి నీళ్లలా ఖర్చవుతుంది.