Navaratri 2025: నవరాత్రుల్లో దుర్గాదేవి ఆశీస్సులు ఈ రెండు రాశుల సొంతం.. ప్రతి కోరిక నెరవేరుతుంది..
దేవీ నవరాత్రి సమయంలో దుర్గాదేవి రూపాలైన నవ దుర్గాలను పూజిస్తారు. ఇలా తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం వలన కోరుకున్న వరం పొందుతాడని విశ్వాసం ఉంది. దీనితో పాటు, శారీరక, మానసిక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారదయ నవరాత్రి సమయంలో రెండు రాశులకు చెందిన వ్యక్తులపై దుర్గాదేవి అనుగ్రహం అపారంగా ఉంటుందని పండితులు చెప్పారు. అయితే వీరు తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా నవరాత్రుల్లో ప్రతిరోజూ పేదలకు దానం చేయని సూచిస్తున్నారు.

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ దుర్గామాతకు అంకితం చేయబడింది. ఈ శుభ సందర్భంగా దుర్గాదేవిని, ఆమె తొమ్మిది రూపాలను పూజిస్తారు. అలాగే కొంతమంది అమ్మవారి ఆశీస్సుల కోసం తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. దేవీ నవరాత్రులలో రెండు రాశుల వారిపై దుర్గాదేవి అపారమైన ఆశీస్సులు ఉంటాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. అమ్మ ఆశీర్వాదంతో అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దీనితో పాటు ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. ఈ రెండు రాశులు ఏమిటో తెలుసుకుందాం..
వృషభ రాశి శరదీయ నవరాత్రి సమయంలో దుర్గాదేవి ఆశీస్సులు ఈ రాశివరిపై కురుస్తాయి. అమ్మ ఆశీస్సులతో ప్రతి కోరిక నెరవేరుతుంది. వివిధ మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దీనితో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. అనేక సందర్భాలలో నాయకత్వం వహించడానికి , ఇతరులకు న్యాయం చేయడానికి అవకాశం కూడా లభిస్తుంది. సమాజంలో గౌరవించబడతారు. ఏదైనా పెద్ద బాధ్యతని వహించాల్సిన రావచ్చు. ఈ రాశి వారిపై గురువు, శుక్రుని ఆశీస్సులు ఉంటాయి. ఈ గ్రహాలు ఆనంద కారకాలు.. కనుక శుభ ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. సమర్థవంతంగా డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. భక్తితో అమ్మవారి పూజించి సేవ చేయడం వలన ఈ నవరాత్రి సమయంలో అన్ని రకాల భౌతిక ఆనందాన్ని పొందుతారు.
తులా రాశి శారదీయ నవరాత్రి సమయంలో దేవగురువు అనుగ్రహం వల్ల వీరు భక్తితో నిండిపోతారు. దుర్గాదేవి పాదాలకు మిమ్మల్ని మీరు అంకితం చేసుకుని పూజిస్తే అమ్మ అనుగ్రహం మీ సొంతం. దుర్గాదేవి భక్తి, సేవ ద్వారా జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతారు. ఎటువంటి కోరిక అయినా నెరవేరుతుంది. వంశం సంప్రదాయం, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతారు. శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంది. అమ్మవారి ఆలయాల సందర్శనార్ధం తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. ధైర్యం పెరుగుతుంది. త్వరలో కెరీర్, వ్యాపారంలో విజయం సాధిస్తారు. చేపట్టిన ఏ పనిని అసంపూర్ణంగా వదిలివేయవద్దు. శరదీయ నవరాత్రి సమయంలో దుర్గాదేవిని భక్తితో పూజించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




