Rashi Phalalu: ఆ రాశివారు వాహన ప్రమాదాలతో జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..

భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి బుధవారం (26.04.2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Rashi Phalalu: ఆ రాశివారు వాహన ప్రమాదాలతో జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..
Horoscope Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Apr 26, 2023 | 4:06 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొని ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు ఈ రాశి వారి ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఉద్యోగ పరంగాను, ఆర్థికంగానూ నిలకడగా ఉంటుంది. అధికార యోగానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా వెనుక పట్టు పడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులతో సమస్యల్లో పడతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి కొత్త ప్రయత్నాలకు అవకాశం కలుగుతుంది. వృత్తి నిపుణులు ఉద్యోగాలు మారటానికి ప్రయత్నిస్తారు. రాదనుకున్న డబ్బు అవసరమైన సమయంలో చేతికి అందుతుంది. నిరుద్యోగులు తీపి కబురు వింటారు. కుటుంబపరంగా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. చాలాకాలంగా మనసులో ఉన్న కోరిక ఒకటి అనుకోని విధంగా నెరవేరుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1): ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. కొత్త ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల వారు లాభాల బాట పడతారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. చాలా మార్గాలలో ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబపరమైన చిక్కుల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణ ఏర్పడుతుంది. ఐటీ తదితర వృత్తి నిపుణులు తమ తమ రంగాల్లో ముందడుగు వేస్తారు. వాహన ప్రమాదాలతో జాగ్రత్త.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. మొండి బకాయి ఒకటి వసూలు అవుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అధికారులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది.ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఉద్యోగ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా వరకు సానుకూలంగా మారే సూచనలున్నాయి. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. చాలావరకు అనుకూలంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులు అండగా నిలబడతారు. దగ్గర బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విదేశాలలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువై ఇబ్బంది పడతారు. వ్యక్తిగత జీవితం క్షణం తీరిక లేకుండా ముందుకు సాగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఐటీ తదితర వృత్తి నిపుణులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.ఉద్యోగ పరంగా దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ చేయడం జరుగుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. పొదుపు సూత్రాలు పాటిస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఆచితూచి అడుగు వేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. సమయం అన్ని విధాల బాగుంటుంది. దీనిని సద్వినియోగం చేసుకొని ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించండి. తిప్పట, శ్రమ ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలను వేగంగా నడపటం అంత మంచిది కాదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగ వ్యాపార విషయాలలో సొంత నిర్ణయాలు వల్ల ఫలితం ఉంటుంది. సహచరులు కొందరు మీ పైన చెడు ప్రచారం సాగించే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు.కొంచెం పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో అదనపు బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబపరంగా కొద్దిగా మానసిక ప్రశాంతత తగ్గుతుంది. బంధువుల కారణంగా కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అంది కొన్ని అవసరాలు తీరుతాయి. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సంబంధమైన ఒత్తిడి ఉంటుంది.విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): ఉద్యోగ పరంగా అంతా మంచే జరుగుతుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. కానీ అనవసర ఖర్చులు చేయి దాటి పోతాయి. మి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు అనుకోకుండా చక్కబడతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు. వృత్తి వ్యాపారాల వారు లాభాలు గడిస్తారు. ఐటీ నిపుణులు విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు సాగిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మోయవలసి వస్తుంది. సహచరుల విధులను కూడా పంచుకోవలసి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణ నెలకొంటుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. అనుకోకుండా ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి, ప్రమోషన్ కి అవకాశం ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. గతంలో చేసిన ఆర్థిక లావాదేవీలు మంచి లాభాలను ఇస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటే అవి ఫలిస్తాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!