Marriage Astrology: కొందరికి అనూహ్యంగా పెళ్లి బాజాలు మోగుతాయి..! ఈ ఏడాది మీకు వివాహ యోగం ఉందా? తెలుసుకోండి..

Marriage Predictions: పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటినుంచి దాదాపు డిసెంబర్ వరకు పెళ్లిళ్లు హడావిడి చోటు చేసుకుంటుంది. ఈ పెళ్లిళ్ల సీజన్లో ఎప్పుడు ఏ రాశి వారికి పెళ్లి అయ్యే అవకాశం ఉందో ఇక్కడ పరిశీలిద్దాం.

Marriage Astrology: కొందరికి అనూహ్యంగా పెళ్లి బాజాలు మోగుతాయి..! ఈ ఏడాది మీకు వివాహ యోగం ఉందా? తెలుసుకోండి..
Marriage Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 24, 2023 | 5:56 PM

Wedding Astrology: పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటినుంచి దాదాపు డిసెంబర్ వరకు పెళ్లిళ్లు హడావిడి చోటు చేసుకుంటుంది. ఈ పెళ్లిళ్ల సీజన్లో ఎప్పుడు ఏ రాశి వారికి పెళ్లి అయ్యే అవకాశం ఉందో ఇక్కడ పరిశీలిద్దాం. పెళ్లి తదితర శుభకార్యాలకు గురు గ్రహం కారకుడు కాగా పెళ్లి నిశ్చయం కావడానికి శుక్రుడు కారకుడు. ప్రస్తుతం గురు గ్రహం రాహువుతో కలిసి మేషరాశిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు ఒకటి రెండు నెలల పాటు వృషభ, మిధున రాశులలో సంచరిస్తాడు. అందువల్ల చాలా రాశుల వారికి ఈ సంవత్సరం పెళ్లి అయ్యే అవకాశం ఉంది. జాతక రీత్యాగ్రహాలకు అనుగుణంగా ఇందులో మార్పులు కూడా ఉండొచ్చు.
మేష రాశి: ఈ రాశిలో గురు రాహువులు సంచరిస్తుండగా కుటుంబ స్థానంలో శుక్రుడు తిష్ట వేసినందువల్ల ఈ రాశి వారికి అతి త్వరలో తప్పకుండా వివాహం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా అకస్మాత్తుగా సంబంధం కుదిరి పెళ్లి అయ్యే సూచనలు ఉన్నాయి. బాగా తెలిసిన వారితో కానీ, దగ్గర బంధువులతో కానీ పెళ్లి నిశ్చయం కావచ్చు. అత్యధిక శాతం వైశాఖ మాసంలోనే, అంటే మే మాసంలోనే పెళ్లి జరిగే అవకాశం ఉంది. లేనిపక్షంలో తప్పకుండా శ్రావణ మాసంలో పెళ్లి కార్యక్రమం పూర్తి అవుతుంది.
వృషభ రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతం శుక్ర గ్రహం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఈ వైశాఖమాసంలోనే పెళ్లి జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సాధారణంగా బంధువులే వచ్చి సంబంధం ఖాయం చేసుకునే అవకాశం కూడా ఉంది. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నందువల్ల సాంప్రదాయ బద్ధంగా భారీ ఖర్చుతో పెళ్లి తతంగం పూర్తి అవుతుందని చెప్పవచ్చు. ఏదైనా కారణంగా వైశాఖ మాసంలో పెళ్లి జరగని పక్షంలో శ్రావణ మాసంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది.
మిథున రాశి: ఈ రాశి వారికి గురుగ్రహం లాభ స్థానంలోనూ, శుక్ర గ్రహం 12వ స్థానంలోనూ సంచరిస్తున్న అందువల్ల దూర ప్రాంతం నుంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా పరిచయస్తుల నుంచి లేదా స్నేహితుల నుంచి సంబంధం వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రావణ మాసంలో గానీ, కార్తీక మాసంలో గానీ పెళ్లి వ్యవహారం పూర్తి అయ్యే అవకాశం ఉంది. శుక్ర గ్రహం వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఆర్భాటంగా, ఆడంబరంగా పెళ్లి కార్యక్రమం పూర్తి కావచ్చు. వైశాఖ మాసంలో పెళ్లి ప్రయత్నాలు చేయటం వల్ల అన్ని విధాలుగాను కలిసి వస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి దశమ స్థానంలో గురువు, లాభ స్థానంలో శుక్రుడు సంచరిస్తూ ఉండడం వల్ల దూర ప్రాంతం నుంచి పెళ్లి సంబంధం వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా సంపన్న కుటుంబం నుంచి సంబంధం రావచ్చు. ఈ రాశి వారికి తప్పకుండా శ్రావణ మాసంలో అంటే జూలై ఆగస్టు నెలల్లో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. శుక్ర గ్రహం లాభ స్థానంలో బలంగా ఉన్నందువల్ల భారీ ఖర్చుతో పెళ్లి జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత వైశాఖమాసంలో పెళ్లి సంబంధం ఖాయం కావచ్చని చెప్పవచ్చు.
సింహ రాశి: ఈ రాశి వారికి మే నెలలో కానీ, జూలై నెలలో కానీ అకస్మాత్తుగా పెళ్లి జరిగే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరి కుదరగానే అతి తక్కువ కాలంలో పెళ్లి ముహూర్తం కుదిరే సూచనలు ఉన్నాయి. సాధారణంగా తక్కువ ఖర్చుతో తృప్తికరంగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ పెళ్లి సంబంధం విదేశాలకు చెందిన సంబంధం కావచ్చు. గురు గ్రహం భాగ్యస్థానంలో, శుక్ర గ్రహం దశమ స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఎంతో ఇష్టం మీద పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఏరి కోరి పెళ్లి చేసుకోవడం లాంటిది జరుగుతుంది.
కన్యా రాశి: ఈ రాశి వారికి అష్టమ స్థానంలో అంటే మాంగల్య స్థానంలో గురువు సంచరిస్తూ ఉండడం, భాగ్య స్థానంలో శుక్రుడు తిష్ట వేసి ఉండటం వల్ల సాధా రణంగా బాగా తెలిసిన వారితో లేదా సన్నిహితు లతో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. సాధారణంగా ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరుగు తుంది. మే నెల 15 లోపున గానీ, ఆగస్టు నెలలో కానీ పెళ్లి వ్యవహారం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎంతో ఆర్భాటంగా సాంప్రదాయ బద్ధంగా పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి.
తులా రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో గురుగ్రహం ఉండటం, అష్టమ స్థానంలో అంటే మాంగల్య స్థానంలో శుక్ర గ్రహం సంచరిస్తూ ఉండటం వల్ల మే 15 లోపు పెళ్లి జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పెళ్లికి సంబంధించి కొద్ది ప్రయత్నం చేసినా అది వెంటనే సత్ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. సాధారణంగా స్నేహితుల ద్వారా పెళ్లి సంబంధం వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ఆడంబరంగా జరిగే సూచనలు ఉన్నాయి. పెళ్లి సంబంధం వారి నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి గురువు ఆరవ స్థానంలో సంచరించడం, శుక్ర గ్రహం ఏడవ స్థానంలో సంచరించడం వల్ల కార్తీక మాసంలోనే పెళ్లి జరిగే అవకాశం ఉంది. శ్రావణమాసం నుంచి పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. సాధారణంగా పశ్చిమ, ఉత్తర దిక్కుల నుంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. విదేశాలలో కానీ దూర ప్రాంతంలో గానీ స్థిరపడి ఉన్న బంధువుల ద్వారా సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. అనుకోకుండా, ఏమాత్రం ఊహించని విధంగా పెళ్లి సంబంధం కుదిరి పెళ్లి అయ్యే అవకాశం ఉంది.
ధనూ రాశి: ఈ రాశి వారికి పంచమ స్థానంలో గురు సంచారం వల్ల తప్పకుండా శ్రావణ మాసంలో అంటే జూలై, ఆగస్టు నెలల్లో పెళ్లి జరిగే అవకాశం ఉంది. వైశాఖ మాసంలో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడం చాలా మంచిది. సాధారణంగా మ్యారేజ్ బ్యూరోల ద్వారా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాలలో లేదా దూర ప్రాంతంలో ఉన్న కుటుంబం నుంచి సంబంధం రావచ్చు. ఆర్భాటంగా, ఆడంబరంగా, సాంప్రదాయ బద్ధంగా పెళ్లి జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో కొంత కష్టపడినప్పటికీ చివరికి మంచి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి.
మకర రాశి: ఈ రాశి వారికి గురువు నాల్గవ స్థానంలో రాహువుతో కలిసి ఉన్నందువల్ల, శుక్ర గ్రహం ఐదో స్థానంలో ఉన్నందువల్ల కార్తీక మాసం తరువాత కానీ పెళ్లి జరిగే అవకాశం లేదు. మొత్తం మీద ఈ ఏడాదంతా పెళ్లి ప్రయత్నాలకే సమయం సరిపోతుంది. కార్తీక మాసంలో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల ఉపయోగం ఉంటుంది. సాధారణంగా ఈ రాశి వారికి బంధు వర్గం నుంచి మంచి పెళ్లి సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఇది బాగా తెలిసిన సంబంధమే అవుతుంది. పెళ్లి సంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా జరిగే సూచనలు ఉన్నాయి.
కుంభ రాశి: ఈ రాశి వారికి కార్తీక మాసం వరకు గురు శుక్ర గ్రహాల సంచారం పెళ్లికి బాగా అనుకూలంగా ఉంది. వైశాఖ మాసంలో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. శ్రావణ కార్తీక మాసంలో తప్పకుండా పెళ్లి వ్యవహారం పూర్తి అవుతుంది. దూరప్రాంతంలో స్థిరపడిన బంధువులు లేదా సన్నిహితుల ద్వారా పెళ్లి సంబంధం కుదురు తుంది. పెళ్లికి పెద్దగా ఖర్చు అయ్యే సూచనలు కనిపించడం లేదు. పెళ్లి వ్యవహారంలో కొద్దిగా సాచివేత లేదా నాన్చుడు ధోరణి కనిపిస్తుంది. కొద్దిగా సహనంతో వ్యవహరిస్తే మంచి సంబంధం కుదరటానికి అవకాశం ఉంది.
మీన రాశి: ఈ రాశి వారికి గురు శుక్ర గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. వైశాఖ మాసంలో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తే శ్రావణ మాసంలో పెళ్లి సందడి పూర్తయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయ త్నాలలో కొద్దిగా ఒత్తిడికి, టెన్షన్ కు గురయ్యే సూచనలు ఉన్నాయి. బాగా తెలిసిన వారితో అనుకోకుండా పెళ్లి నిశ్చయం కావచ్చు. ఏలినాటి శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే తప్పకుండా మంచి పెళ్లి సంబంధం కుదరటంతో పాటు పెళ్లి కూడా సవ్యంగా జరుగుతుంది.
ముఖ్యమైన పరిహారాలు: ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని మరింత శ్రద్ధగా, నిష్టగా పూజించడం వల్ల పెళ్లికి సంబంధించినంత వరకు మనసులోని కోరికలు నెరవేరుతాయి. తరచూ వినాయకుడి ఆలయానికి వెళ్లి అర్చన చేయించడం వల్ల కూడా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. త్వరగా పెళ్లి సంబంధం కుదరటం త్వరగా పెళ్లి కావడం వంటివి చోటు చేసుకుంటాయి. సాధారణంగా పెళ్లి ప్రయత్నాల సమయంలో వధువు లేదా వరుడు నల్లటి దుస్తులు, ఎర్రటి దుస్తులు వేసుకోకపోవడం శుభకరం. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావాలన్నా, మంచి సంబంధం కుదరాలన్నా పసుపు పచ్చ గోధుమ లేదా తెలుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరించడం మంచిది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో