Astrology: రాహువుతో చెడే కాదు మంచి కూడా.. ఇక ఆ రాశుల వారికి అన్ని శుభాలే..!
Ketu Transit: సహజంగా పాప గ్రహమైన రాహువు ప్రతి రాశిలోనూ 18 నెలల పాటు సంచారం చేస్తారు. మే 18 వరకు మీన రాశిలో సంచారం చేసి, ఆ తర్వాత కుంభ రాశిలో సంచారం ప్రారంభించబోతున్న రాహువు క్రమంగా శుభ గ్రహంగా మారబోతోంది. ప్రస్తుతం గురు నక్షత్రమైన పూర్వాభాద్రలోకి ప్రవేశిస్తుండడం, శుక్ర, బుధులతో కలుస్తుండడం వల్ల తన సహజసిద్ధమైన పాప లక్షణాలను కోల్పోయి శుభ లక్షణాలను సంక్రమించుకోవడం జరుగుతుంది.

Rahu Transit Effects
మే 18 వరకు మీన రాశిలో సంచారం చేసి, ఆ తర్వాత కుంభ రాశిలో సంచారం ప్రారంభించబోతున్న రాహువు క్రమంగా శుభ గ్రహంగా మారబోతోంది. సహజ పాప గ్రహమైన రాహువు ప్రతి రాశిలోనూ 18 నెలల పాటు సంచారం చేస్తారు. కుంభ రాశిలో మరో ఏడాదిన్నర పాటు ఉండే రాహువు ప్రస్తుతం గురు నక్షత్రమైన పూర్వాభాద్రలోకి ప్రవేశిస్తుండడం, శుక్ర, బుధులతో కలుస్తుండడం వల్ల తన సహజసిద్ధమైన పాప లక్షణాలను కోల్పోయి శుభ లక్షణాలను సంక్రమించుకోవడం జరుగుతుంది. ఫలితంగా మేషం, సింహం, కన్య, వృశ్చికం, కుంభ, మీన రాశులకు సైతం శుభ యోగాలను కలిగించే అవకాశం ఉంది.
- మేషం: ప్రస్తుతం ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు ఈ రాశివారికి విదేశీ ఉద్యోగాలు, విదేశీ వృత్తులు వంటివి కలిగించే అవకాశం ఉంది. రాహువు విదేశాలకు కారకుడు. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగపరంగా, గృహపరంగా స్థిరత్వం లభిస్తుంది. బాగా దూరపు బంధువుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.
- సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు ఈ రాశివారికి అనేక కష్టనష్టాల నుంచి విముక్తి కల్పించే అవకాశం ఉంది. ఆస్తి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగి, ఇతర సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న రాహువు వల్ల వైవాహిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల నుంచి ఇక విముక్తి లభిస్తుంది. వ్యసనాల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. ఉన్నతస్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయడం జరుగుతుంది.
- వృశ్చికం: సాధారణంగా పంచమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఎంత కష్టపడ్డా సమర్థతకు, ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉండదు. పిల్లల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక ఈ సమస్యలన్నీ దూరమవుతాయి. అధికారులు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు. పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- కుంభం: ఈ రాశివారికి ధన స్థానంలో రాహువు సంచారం వల్ల ఆర్థిక సమస్యలు వెంటాడే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరిగినా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం కష్టంగా మారుతుంది. కుటుంబంలో కలతలు తలెత్తుతాయి. ఇక నుంచి ఈ సమస్యల నుంచి బయటపడతారు. ఆదా యం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
- మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువు వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏ పనీ, ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రావు. ఎంత శ్రమపడ్డా గుర్తింపు లభించదు. ఆదాయం స్తంభించిపోతుంది. ఇక నుంచి ఈ సమస్యలు ఉండకపోవచ్చు. అనేక విధాలుగా ఆదాయం పెరిగి ముఖ్యమైన అవసరాలు గడిచిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు గుర్తింపు లభించి అంద లాలు ఎక్కుతారు. విదేశాలకు వెళ్లడానికి, అక్కడ స్థిరపడడానికి అనేక అవకాశాలు లభిస్తాయి.