Chandradhi Yoga: చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
Adhikara Yoga: జూన్ 2, 3, 4 తేదీల్లో ఏర్పడుతున్న అరుదైన చంద్రాధియోగం కారణంగా కొన్ని రాశుల వారికి అధికార యోగం పట్టనుంది. ఈ యోగ ప్రభావంతో చేపట్టే పనులు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండగా, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చు. ముఖ్యంగా మేషం, మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారు ఈ మూడు రోజుల్లో విశేష ప్రయోజనాలు, శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది.

Chandra Adhi Yoga
జూన్ 2, 3. 4 తేదీల్లో చంద్రుడు ధనూ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ మూడు రోజుల్లో చంద్రుడికి 7వ స్థానంలో బుధ, శుక్రులు, అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల చంద్రా ధియోగం అనే అధికార యోగం ఏర్పడింది. ఫలితంగా ఈ మూడు రోజులు కొన్ని రాశుల వారికి అత్యంత శుభ దినాలు కాబోతున్నాయి. సాధారణంగా ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయత్నాలు ప్రారంభించినా, ఎటువంటి నిర్ణయాలు అమలుపరచినా తప్పకుండా విజయవంతం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. మేషం, మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారు ఈ చంద్రాధియోగం విశేషంగా లాభాలు పొందడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న చంద్రుడికి అధియోగం ఏర్పడడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లేదా సంపద కలిసి వస్తుంది.
- మిథునం: ఈ రాశిలో ఉన్న శుభ గ్రహాలు సప్తమ స్థానంలో చంద్రుడిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి అధి యోగం కలిగింది. దీనివల్ల ఇంటా బయటా ఈ రాశివారి ప్రాభవం పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి కలుగుతుంది. అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు నెరవేరుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది.
- కన్య: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న లాభాధిపతి చంద్రుడికి శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో చంద్రాధియోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలిగే అవకాశం ఉంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
- ధనుస్సు: ఈ రాశిలో ఉన్న చంద్రుడికి సప్తమ స్థానంలో బుధ, శుక్రులు, అష్టమంలో గురువు ఉండడం వల్ల చంద్రాధియోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి.
- కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న చంద్రుడికి అధియోగం కలగడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రతిభకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్తపుంతలు తొక్కుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.
Follow Us