Lunar Eclipse: తిరోగమనంలో శనీశ్వరుడు.. ౩ రాశులపై శని అనుగ్రహం.. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్
ఈ సంవత్సరం పితృ పక్షం ఒక ప్రత్యేక ఖగోళ సంఘటనతో ప్రారంభం అయింది. ఇది జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం పితృ పక్షం మొదటి రోజున అంటే ఈ రోజు సాయత్రం ఏర్పడుతుంది. ఈ రోజున శని దేవుడు తిరోగమనంలో ఉండబోతున్నాడు. శని ఈ తిరోగమనం కొన్ని రాశులకు చాలా శుభప్రదంమని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ సంవత్సరం పితృ పక్షం ఈ రోజు నుంచి (సెప్టెంబర్ 7, 2025) ప్రారంభమవుతుంది. ఈ రోజునే, సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం శనీ శ్వరుడి అధినేత అయిన కుంభ రాశిలో ఏర్పడనుంది. గ్రహాలు, నక్షత్రాల ఈ అరుదైన కలయిక మొత్తం 12 రాశులకు చెందిన వ్యక్తుల జీవితాల్లో పెద్ద మార్పును తెస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు.. దాని వేగం తగ్గి దాని ప్రభావం పెరుగుతుంది. ఈ సమయంలో శని ప్రభావం ముఖ్యంగా మిథున, వృశ్చిక, మీన రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా 3 రాశుల వ్యక్తులు ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
జ్యోతిషశాస్త్రంలో గ్రహణాల ప్రభావం జ్యోతిషశాస్త్రంలో గ్రహణ కాలం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో గ్రహాల కదలికలో ప్రత్యేక మార్పులు ఉంటాయి. చంద్రగ్రహణం రోజు శని తిరోగమన స్థితిలో ఉంటాడు. శని తిరోగమనం చాలా మందికి కొత్త అవకాశాలు, మార్పులకు మార్గం సుగమం చేస్తుంది.
మిథునం: వృత్తి, ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు. మిథున రాశి వారికి శని తిరోగమనం వీరి కెరీర్‌లో విజయానికి , ఆర్థిక పురోగతికి కొత్త ద్వారాలను తెరుస్తుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు పెండింగ్ పని పూర్తి చేస్తారు. ఆఫీసులో వీరి కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా జీతం పెరుగుదల లభించవచ్చు. వ్యాపారవేత్తలు కూడా భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ఈ కాలంలో విశ్వాసం పెరుగుతుంది. కొత్త ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసే అవకాశం ఉంది.
వృశ్చికం: గౌరవం, కుటుంబ ఆనందం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయం సామాజిక ప్రతిష్ట, కుటుంబ సంబంధాలను బలోపేతం చేస్తుంది. శని తిరోగమనం కారణంగా గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి. సమాజంలో వీరి స్థాయి పెరుగుతుంది. కుటుంబంలో జరుగుతున్న గొడవలు, సమస్యలు పరిష్కరించబడతాయి. ఆనందం, శాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఆస్తి సంబంధిత విషయాలలో కూడా ప్రయోజనాలను పొందవచ్చు. వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మీనం: అదృష్టం వీరి సొంతం ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీన రాశి వారికి ఈ తిరోగమన శని గ్రహం అదృష్టాన్ని పెంచుతుంది. చేపట్టిన ప్రతి పనినిని అదృష్టం మద్దతుతో పూర్తి చేస్తారు. ప్రయత్నాలను విజయవంతం చేస్తుంది. విద్య, ఉద్యోగం లేదా వ్యాపారం దైనా ప్రతి రంగంలో ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. విదేశీ ప్రయాణం లేదా విదేశాలకు సంబంధించిన పనిలో విజయం సాధించే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం మీ కలలను నెరవేర్చుకోవడానికి ఒక సువర్ణావకాశాన్ని తెచ్చిపెడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)








