Money Astrology: తులా రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశులవారికి నడమంత్రపు సిరి యోగం!
జ్యోతిషశాస్త్రంలో నడమంత్రపు సిరిని కూడా ఒక యోగంగా చెప్పడం జరిగింది. ఇది దాదాపు ఆకస్మిక ధన లాభం లాంటిదే. గ్రహ సంచారంలో ధన, భాగ్య, లాభస్థానాలు బాగా బలంగా ఉన్నవారికి తప్పకుండా ఈ యోగం పడుతుంది. దాని ప్రకారం, అనుకోకుండా, ఊహించని మార్గాల ద్వారా డబ్బు కలిసి వచ్చి ధనవంతులు కావడం జరుగుతుంది. ఇది కొద్దిగా వ్యక్తిగత జాతకాలపై కూడా ఆధారపడి ఉన్నప్పటికీ, గ్రహచారంలో గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ నడమంత్రపు సిరి యోగం పట్టకుండా ఉండే అవకాశం లేదు.
జ్యోతిషశాస్త్రంలో నడమంత్రపు సిరిని కూడా ఒక యోగంగా చెప్పడం జరిగింది. ఇది దాదాపు ఆకస్మిక ధన లాభం లాంటిదే. గ్రహ సంచారంలో ధన, భాగ్య, లాభస్థానాలు బాగా బలంగా ఉన్నవారికి తప్పకుండా ఈ యోగం పడుతుంది. దాని ప్రకారం, అనుకోకుండా, ఊహించని మార్గాల ద్వారా డబ్బు కలిసి వచ్చి ధనవంతులు కావడం జరుగుతుంది. ఇది కొద్దిగా వ్యక్తిగత జాతకాలపై కూడా ఆధారపడి ఉన్నప్పటికీ, గ్రహచారంలో గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ నడమంత్రపు సిరి యోగం పట్టకుండా ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులకు ఈ యోగం పట్టే అవకాశం ఉంది. వాస్తవానికి వారం క్రితం శుక్రుడు తులా రాశిలో ప్రవేశించినప్పటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 లోగా ఈ యోగం పట్టే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశివారికి ధన కారకుడు, భాగ్యాధిపతి అయిన గురువు ఈ రాశిలోనే సంచరించడం తప్ప కుండా ధన యోగాన్ని కలగజేస్తుంది. నిజానికి ఈ రాశివారికి ఈ యోగ కాలం ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. ఏదో ఒక రూపంలో వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. లాభ స్థానంలో శనీశ్వరుడు కూడా సంచరిస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కారణంగా వీరికి ఈ నడమంత్రపు సిరి యోగం పడుతుంది. ఆదాయాలతో పాటు ఆస్తులు పెరగడం జరుగుతుంది.
- మిథునం: ధన కారకుడైన గురువు లాభ స్థానంలో ఉండడం, భాగ్యాధిపతి శని భాగ్యంలోనే ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాలే కాకుండా మరికొన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వచ్చి, ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేనంతగా మెరుగుపడుతుంది. కుటుంబపరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గురువు, పంచమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల వీరి ప్రయ త్నాలు, ఆలోచనలు, పథకాలు బాగా కలిసి వచ్చి ఆర్థికంగా బలం పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా భాగ్య స్థానంలో ఉన్న గురువు కారణంగా అప్రయత్న ధన లాభం ఉంటుంది. వీరికి అనేక విధాలుగా ఆస్తులు కలిసి రావడం, వారసత్వ సంపద లభించడం, ఆస్తుల విలువ భారీగా పెరగడం, ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరిగి, సంపన్నులుగా మారే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని ధన కారకుడైన గురువు వీక్షించడం వల్ల వీరి ఆర్థిక పరి స్థితి చాలా తక్కువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అకస్మా త్తుగా, అప్రయత్నంగా వీరి ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంటుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలం అయి, అత్యధిక లాభం చేకూరు తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారానే కాక, ఆస్తుల పరంగా వీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశివారికి తృతీయంలో శనీశ్వరుడు, లాభ స్థానంలో శుక్రుడు సంచరించడం పెద్ద ఆస్తిగా చెప్పవచ్చు. ఈ రెండు గ్రహాల వల్ల వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మారిపోతుంది. రాశ్యధిపతి, ధన కారకుడు అయిన గురువును ఈ రెండు గ్రహాలు వీక్షించడం వల్ల కూడా వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా వీరి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగ డంతో పాటు పితృవర్గం నుంచి ఆస్తి కలిసి రావడం, ఆస్తి విలువ పెరగడం కూడా జరుగుతుంది.
- మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో ధనాధిపతి శని ఉండడం, లాభ స్థానంలో కుజ, రవులు ఉండడం వ్ల తప్పకుండా ఈ నడమంత్రపు సిరి యోగం పట్టే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలతో పాటు ఆర్థిక ప్రయత్నాలన్నీ ఆదాయం వృద్ధి చెందడానికి, సంపన్నుడు కావడానికి తోడ్పడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా ఆదాయం బాగా పెరుగుతుంది. డబ్బును సవ్య మైన మార్గాలలో మదుపు చేయడం గానీ, ఇతరత్రా పెట్టుబడులు పెట్టడం గానీ జరుగుతుంది.
- కుంభం: ఈ రాశివారికి లాభ స్థానంలో బుధుడు, భాగ్య స్థానంలో శుక్రుడు సంచరించడం, ధన కారకుడు గురువు భాగ్య స్థానాన్ని వీక్షించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారి పోవడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా మారి, ఆదాయాన్ని వృద్ధి చేస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలివ్వడానికి అవకాశం ఉంది. ఇవి కాక, పితృవర్గం నుంచి ఆస్తిపాస్తులు కలిసి రావడం, లాటరీ రావడం వంటివి కూడా జరగవచ్చు.