Horoscope Today: సమాజంలో వారి మాటకు విలువ పెరుగుతుంది.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు..
దిన ఫలాలు (డిసెంబర్ 8, 2023): మేష రాశికి చెందిన ఉద్యోగులు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. మిథున రాశికి చెందిన వారికి వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (డిసెంబర్ 8, 2023): మేష రాశికి చెందిన ఉద్యోగులు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. మిథున రాశికి చెందిన వారికి వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. అన్నివిధాలు గానూ ఈ రాశివారికి ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యక్తిగత పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కారణంగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో అపా ర్థాలు తలెత్తే అవకాశం ఉంది. సతీమణితో సంప్రదించి నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. అధికారుల మంచి ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి చాలావరకు పరి ష్కారం అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు తమకు అందివచ్చిన అవ కాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టు కునే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరు స్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో సాను కూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అన్ని విధాలు గానూ బాగుంది. మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆరో్గ్యం నిలకడగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని బాగా లబ్ధి పొందుతారు. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రయాణాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు ఒక శుభకార్యంలో ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సతీసమేతంగా వెళ్లి వస్త్రాభరణాలు కొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యో గులు శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొన్ని లాభదాయక మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి రంగంలో మార్పులు జరుగుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దాంపత్య జీవితం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు అవు తాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. పిల్లల నుంచి శుభ వార్తలు అందుకుంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కూడా ఉత్సాహంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవు తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సాను కూల పడతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వ్యాపార వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యుల వల్ల ఊహిం చని సమస్యలు తలెత్తుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండడం వల్ల విశ్రాంతి కరువవుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశ మనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను కూడా కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్త రించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యక్తిగత సమ స్యకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో చేరడానికి అవకాశం లభిస్తుంది.