Karthika Masam 2025: కార్తీక మాసమంతా ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
కార్తీక మాసంలో కొన్ని రాశుల వారికి గ్రహ స్థానాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. గురు, శుక్ర, కుజుల శుభ సంచారం వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు అపారమైన అదృష్టం, ధన లాభం కలగనున్నాయి. ఉద్యోగం, వ్యాపారాల్లో విజయాలు, కుటుంబ సౌఖ్యం, కోరికలు నెరవేరతాయి. లక్ష్మీదేవి, కుబేరులతో పాటు పరమేశ్వరుడి అనుగ్రహం సిద్ధిస్తుంది.

Karthika Masam 2025
పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసమంతా కొన్ని రాశులకు కొద్దిపాటి శివార్చనతో అత్యంత వైభవంగా సాగిపోయే అవకాశం ఉంది. ఈ మాసమంతా గురు గ్రహం కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిలో ఉండడం, శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో, కుజుడు తన స్వక్షేత్ర మైన వృశ్చిక రాశిలో సంచారం చేయడం వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. లక్ష్మీదేవి, కుబేరులతో పాటు, పరమేశ్వరుడి అనుగ్రహం అపారంగా కలుగుతుంది.
- మేషం: ఈ రాశికి రాశ్యధిపతి కుజుడితో సహా, గురు, శుక్రులిద్దరూ అనుకూలంగా మారినందువల్ల వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయాలు సాధిస్తారు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.
- కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ గురువు, పంచమంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. జీవితంలో ఊహించని విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెంది, పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
- కన్య: ఈ రాశికి ధన, లాభ స్థానాలు బాగా బలపడుతున్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపా రంగా లాభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రతి రంగంలోనూ శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరిగి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాయి. వ్యక్తి గత సమస్యలు కూడా బాగా తగ్గుతాయి. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- తుల: దశమంలో గురువు ఉచ్ఛలోనూ, శుక్రుడు, కుజుడు స్వస్థాన సంచారం వల్ల ఈ రాశివారికి దశ తిరిగే అవకాశం ఉంది. మహా భాగ్య యోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.
- ధనుస్సు: రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, లాభ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఈ రాశివారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించి విదేశీ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు ఎక్కువగా జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి హంస, మాలవ్య మహా పురుష యోగాలు ఏక కాలంలో కలగడంతో పాటు, లాభ స్థానంలో లాభాధిపతి కుజుడి సంచారం వల్ల రాజపూజ్యాలు పెరగడంతోపాటు ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఊహించని స్పందన లభిస్తుంది. నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం కూడా ఉంది. తండ్రి నుంచి ఆస్తిసాస్తులు కలిసి వస్తాయి.



