- Telugu News Photo Gallery Spiritual photos Goddess Lakshmi Devi Grace: These Three Zodiacs Will Never Face Financial Crisis
లక్ష్మీదేవికి ఈ మూడు రాశులంటే ఇష్టం.. డబ్బుకు లోటు అన్నమాటే ఉండదు.. మీరున్నారా చెక్ చేసుకోండి
సనాతన ధర్మంలో లక్ష్మీదేవి సకల సంపదలకు, సౌభాగ్యానికి అధిదేవత. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఆమె ఆగ్రహిస్తే సమస్యలు వస్తాయని భావిస్తారు. అందుకనే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ తపిస్తారు. అటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఉన్నాయని తెలుసా.. ఆ రాశుల్లో జన్మించిన వ్యక్తులపై లక్ష్మీదేవి ప్రత్యేకంగా అనుగ్రహాన్ని కురిపిస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Oct 22, 2025 | 1:00 PM

హిందూ మతంలో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది. అయితే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడానికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున భక్తులు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. ఇంటిలో సిరి సంపదలను అనుగ్రహించమని ప్రార్థిస్తారు.

లక్ష్మీదేవిని నిర్మలమైన హృదయంతో పూజించే వారి ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉందని.. జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోరని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులలో.. కొన్ని రాశులంటే లక్ష్మీదేవికి ఇష్టం. వారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తుంది. కనుక ఈ రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఏమిటో తెలుసుకుందాం...

వృషభ రాశి: ఈ రాశి వారిని లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనవారిగా భావిస్తుంది. ఈ రాశిని శుక్రుడు పాలిస్తాడు. నవ గ్రహాల్లో శుక్రుడు కూడా సంపద, శ్రేయస్సును సూచిస్తాడు. వృషభ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే గుణం ఉన్నావారు. ఆచరణాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటారు. వీరు తమ కృషితో ప్రతిచోటా విజయం సాధిస్తారు. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అయినా ఎల్లప్పుడూ ప్రయోజనాలను పొందుతారు. లక్ష్మీ దేవి ఆశీర్వాదంతో, వీరు జీవితంలో డబ్బుకు కొరత ఉండదు. తమ కుటుంబ సభ్యులతో సుఖవంతమైన, విలాసాలతో నిండిన జీవితాన్ని గడుపుతారు.

సింహ రాశి: ఈ రాశికి నవ గ్రహాలకు రాజు సూర్యుడు అధిదేవత. ఈ రాశిలో జన్మించిన వారు నాయకత్వం, ఆత్మవిశ్వాసం , ధైర్యం కలిగి ఉంటారు. సింహరాశి వారు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి నిర్ణయాలలో దృఢంగా ఉంటారు. లక్ష్మీ దేవి ఆశీర్వాదం కారణంగా, వారు ఎల్లప్పుడూ ఆర్థిక స్థిరత్వాన్ని అనుభవిస్తారు. ఈ వ్యక్తులు స్వయంగా విజయ శిఖరాలకు చేరుకుంటారు. వీరు ఎవరి నుంచి ఎప్పుడూ ఆర్థిక సహాయం ఆశించరు.

మీన రాశి: మీన రాశి వారు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవారు. ఈ రాశి వారిని పాలించే గ్రహం బృహస్పతి. జ్ఞానం, శ్రేయస్సు కారకుడు గురు గ్రహం. మీన రాశి వారు అంకితభావం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తారు. తాము చేపట్టిన పని పట్ల విశ్వాసం, అంకితభావంతో ఉంటారు. ఈ గుణం ఎల్లప్పుడూ లక్ష్మీ దేవిని సంతోషపరుస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తులు పూర్వీకుల ఆస్తి లేదా ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. మీన రాశి వారు బలమైన ఆర్థిక స్థితిని కలిగి ఉంటారు. జీవితం ఆనందం, శాంతితో నిండి ఉంటుంది.




