జూలై 19 రాశిఫలాలు: అదృష్టం ఎవరిని వరించనుంది..? ఆదివారంనాటి రాశిఫలాలు
Daily Horoscope (July 19, 2026): ఆదివారం 12 రాశుల వారికి గ్రహాల అనుకూలత, ప్రతికూలతల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాల్లో మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశికి సంబంధించిన పూర్తి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి.

దిన ఫలాలు (జూలై 19, 2026): మేష రాశి వారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో ఇతరుల కంటే ముందుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. పనులను పూర్తి చేయడంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. పిల్లల చదువుల విషయంలో ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక శుభవార్త వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో సంబంధాలు మెరుగవుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో ఇతరుల కంటే ముందుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేపడతారు. కుటుంబానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడ తారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులుండే అవకాశముంది. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిత్రుల మీద బాగా ఖర్చు పెడతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ అభిప్రాయాలు స్వీకరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో విభేదించే అవకాశం ఉంది. ఒకరిద్దరు బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని కార్యసిద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి అనుకోని శుభవార్త వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అనుకోని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఎటువంటి ఒడిదుడు కులూ లేకుండా పురోగమిస్తాయి. ఆదాయం కొద్దిగాను, ఖర్చులు భారీగానూ పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్య బాధపెడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో పూర్తవుతాయి.కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సామా జిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఆదాయానికి లోటుండదు. ఖర్చులు తగ్గిం చుకోవడం మంచిది. పిల్లలకు సంబంధించి ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం పెరిగి ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది. లాభాలపరంగా వ్యాపారాలకు ఢోకా ఉండదు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సోదరులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. మిత్రుల సాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృథా ఖర్చులు మాత్రం అదుపు లేకుండా సాగిపోతాయి. ముఖ్యమైన పనులన్నీ నిరాటంకంగా పూర్తవుతాయి. బంధువుల నుంచి విమర్శలు వస్తాయి. ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగించడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్త వింటారు. జీవిత భాగస్వామికి ధనపరంగా మంచి అదృష్టం పడుతుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. దైవకార్యాలకు సహాయపడతారు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాన్ని సంద ర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు సన్నిహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మనసులోని కోరిక అనుకోకుండా నెరవేరుతుంది. వృత్తి జీవితం చాలావరకు బిజీగా సాగిపోతుంది. నష్టదాయక పనుల జోలికి పోవద్దు. వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారంలో పోటీదార్ల సమస్యలను అధిగమిస్తారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ప్రస్తుతానికి ప్రయాణాల్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపా రాలు చాలావరకు లాభసాటిగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాల్ని సాధిస్తారు.
Also Read: వారఫలాలు.. ఆ రాశుల వారికి కొత్త ఉద్యోగం, ఆకస్మిక ధనలాభం..



